News August 2, 2024
ఆగస్టు 2: చరిత్రలో ఈరోజు

✒ 1861: రసాయన శాస్త్రజ్ఞుడు ప్రఫుల్ల చంద్ర రాయ్ జననం
✒ 1876: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జననం
✒ 1880: నాటక దర్శకుడు, లాయర్ బళ్లారి రాఘవ జననం
✒ 1922: టెలిఫోన్ ఆవిష్కర్త అలెగ్జాండర్ గ్రాహంబెల్ మరణం
✒ 1924: స్త్రీవాద రచయిత్రి, సంపాదకురాలు మల్లాది సుబ్బమ్మ జననం
✒ 1944: అవధాని, కవి ఆశావాది ప్రకాశరావు జననం
✒ 1966: మాజీ క్రికెటర్ ఎం.వి.శ్రీధర్ జననం
✒ 1979: మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ జననం
Similar News
News November 27, 2025
నెల్లూరు జిల్లాకు మరోసారి భారీ వర్షం..!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 29, 30 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిన నేపథ్యంలో ఈ ప్రభావం నెల్లూరు జిల్లాపై ఉండనున్నట్లు అధికారులు ప్రకటించారు. రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News November 27, 2025
వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు

TG: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పూడూరు మండలం రాకంచెర్లలో సెకను పాటు భూమి కంపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు గ్రామానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.
News November 27, 2025
ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.


