News August 21, 2024
ఆగస్టు 21: చరిత్రలో ఈ రోజు

1914: సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావు జననం
1946: దివంగత కేంద్ర మంత్రి ఆలె నరేంద్ర జననం
1963: నటి రాధిక జననం
1978: భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ మరణం
1978: నటి భూమిక జననం
1986: జమైకన్ పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ జననం
1999: ప్రపంచ కవితా దినోత్సవం
2013: ‘సాహిత్య అకాడమీ’ గ్రహీత మాలతీ చందూర్ మరణం
* జాతీయ వృద్ధుల దినోత్సవం.
Similar News
News November 1, 2025
కొరియన్ల బ్యూటీ సీక్రెట్ ఇదే..

ప్రస్తుతం ఎక్కడ చూసినా కొరియన్ బ్యూటీ ట్రెండ్ వైరల్ అవుతోంది. అయితే కొరియన్లలా కనిపించాలని వారు వాడే ఉత్పత్తులు వాడితే సరిపోదంటున్నారు నిపుణులు. వారి బ్యూటీ సీక్రెట్ ఆరోగ్యకరమైన అలవాట్లే కారణం. మార్నింగ్ స్కిన్కేర్ రిచ్యువల్, ప్రోబయోటిక్స్తో నిండి ఉన్న ఆహారాలు, తగిన నిద్ర, నీరు, సన్ స్క్రీన్ వాడటం, ప్రకృతిలో సమయం గడపడం కొరియన్ల అలవాటు. వీటివల్లే వారు అందంగా, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
News November 1, 2025
రేట్లు సవరించినా గణనీయంగా GST వృద్ధి

TG: OCTలో రాష్ట్రం ₹5,726 కోట్ల GST ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది అక్టోబర్లో ఇది ₹5,211 కోట్లు మాత్రమే. అప్పటితో పోలిస్తే 10% వసూళ్లు పెరిగాయి. GST స్లాబ్లను తగ్గించి రేట్లను హేతుబద్ధీకరించినా ఈసారి వృద్ధి సాధించగలిగింది. పండుగ సీజన్లు రాబడి పెరగడానికి దోహదపడ్డాయి. SEPలో వివిధ కారణాల వల్ల రాష్ట్రం GST ఆదాయాన్ని భారీగా కోల్పోయింది. ఆనెలలో GST ఆదాయం మైనస్ 5%తో ₹4,998 కోట్లు మాత్రమే వచ్చింది.
News November 1, 2025
ఇతిహాసాలు క్విజ్ – 53 సమాధానాలు

1. జ్యోతిర్లింగం మొదలు, తుది తెలుసుకోలేని దేవతలు ‘బ్రహ్మ, విష్ణువు’.
2. తారకాసురుని సంహరించింది ‘కార్తికేయ స్వామి’.
3. దక్ష యజ్ఞాన్ని నాశనం చేసిన శివుడి ఉగ్ర రూపం పేరు ‘వీరభద్ర’.
4. శ్రీకృష్ణుడికి బాణం వేసిన వేటగాడి ‘జరా’.
5. పంచభూత స్థలాల్లో భూమి (పృథ్వీ) లింగం ‘కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం’లో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>


