News August 28, 2025
ఆగస్టు 28: చరిత్రలో ఈ రోజు

1934: దక్షిణ భారత దేశపు నేపథ్య గాయని ఎ.పి.కోమల జననం
1949: నటి డబ్బింగ్ జానకి జననం
1959: సినీ నటుడు సుమన్ జననం(ఫొటోలో)
1983: శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ జననం
2006: నటుడు, దర్శకుడు డి.వి.నరసరాజు మరణం
Similar News
News August 28, 2025
నేటి నుంచి విశాఖలో జనసేన సమావేశాలు

AP: ఇవాళ్టి నుంచి విశాఖలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ‘సేనతో సేనాని’ ప్రారంభంకానుంది. మూడ్రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇవాళ పార్టీ ఎంపీలు, MLAలు, MLCలతో పవన్ భేటీ అవుతారు. రేపు 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి వచ్చే క్రియాశీలక కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులతో ప్రత్యేక భేటీ ఉంటుంది. 30వ తేదీన అల్లూరి సీతారామరాజు ప్రాంగణం(ఇందిరా గాంధీ స్టేడియం) నుంచి పవన్ ప్రసంగిస్తారు.
News August 28, 2025
5 జిల్లాలకు రెడ్ అలర్ట్.. అత్యంత భారీ వర్షాలు

TG: రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేటలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భువనగిరి, ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(ఆరెంజ్ అలర్ట్), మిగతా జిల్లాల్లోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
News August 28, 2025
నేడు జపాన్ పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఇవాళ అర్ధరాత్రి జపాన్‌కు బయలుదేరనున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో అక్కడ పర్యటించి 15వ ఇండియా-జపాన్ యాన్యువల్ సమ్మిట్‌లో పాల్గొంటారు. జపనీస్ PM ఇషిబాతో సమావేశమై ఇరు దేశాల దౌత్య, ట్రేడ్ సంబంధాలపై చర్చిస్తారు. 2018 తర్వాత మోదీ జపాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. 2014లో ఆయన PMగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు జపాన్‌లో పర్యటించారు.