News August 28, 2024

ఆగస్టు 28: చరిత్రలో ఈ రోజు

image

1934: దక్షిణ భారత దేశపు నేపథ్య గాయని ఎ.పి.కోమల జననం
1949: నటి డబ్బింగ్ జానకి జననం
1959: సినీ నటుడు సుమన్ జననం
1983: శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ జననం
2006: నటుడు, దర్శకుడు డి.వి.నరసరాజు మరణం

Similar News

News January 10, 2026

మెడ నలుపు తగ్గాలంటే?

image

హార్మోన్ల మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల మెడ నల్లగా మారుతుంది. దీన్ని తొలగించడానికి ఈ చిట్కాలు. * పెరుగు, నిమ్మరసం కలిపి మెడకు రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. * పసుపు, పాలు కలిపి మెడకి అప్లై చేయాలి. దీన్ని 20నిమిషాల తర్వాత కడిగేయాలి. * అలోవెరాజెల్‌‌, కాఫీపొడి, పసుపు కలిపి మెడకి రాసి, ఆరాక నీటితో స్క్రబ్ చేయాలి. మరిన్ని స్కిన్, హెయిర్ కేర్ టిప్స్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.

News January 10, 2026

నేడు ఇవి దానం చేస్తే?

image

పుష్య మాస శనివారాల్లో చేసే దానం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. చలి తీవ్రంగా ఉండే ఈ మాసంలో పేదలకు కంబళ్లు, దుప్పట్లు, వస్త్రాలను దానం చేయాలి. ఇవేకాక నల్ల నువ్వులు, బెల్లం, నూనె దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహంతో జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ పవిత్ర మాసంలో స్నాన, జప, తపాదులతో పాటు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభించి కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. పరులకు చేసే సాయమే దేవుడికి చేరే నిజమైన పూజ.

News January 10, 2026

పెరుగుతున్న చలి.. వణుకుతున్న జనం

image

తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. రెండు మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. TGలో 14 జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 5.6 డిగ్రీలుగా ఉంది. అటు ఏపీలోనూ చలి తీవ్రత పెరిగింది. మన్యం, అల్లూరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. నిన్న రాత్రి పాడేరులో 4.1, పెదబయలు 4.8, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.