News August 31, 2025

ఆగస్టు 31: చరిత్రలో ఈ రోజు

image

1864: హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జననం
1923: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు జననం
1925: ప్రముఖ కవి, సాహితీవేత్త ఆరుద్ర జననం
1932: ప్రముఖ కథా రచయిత రావిపల్లి నారాయణరావు జననం
1969: భారత మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్ జననం
2014: చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు మరణం(ఫొటోలో)

Similar News

News August 31, 2025

మహిళలకు ఫ్రీ బస్సు.. పురుషుల డిమాండ్స్ ఇవీ!

image

AP, TGలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని పురుషులు వాపోతున్నారు. ఇటీవల విజయనగరంలో ఓ బస్సులో మహిళ పురుషుడిపై <<17552607>>దాడి<<>> చేయడం చర్చనీయాంశంగా మారింది. డబ్బులు కట్టి నిలబడి వెళ్లాల్సి వస్తోందని, లాస్ట్ సీటు వరకు మహిళలే కూర్చుంటున్నారని చెబుతున్నారు. పురుషులకు సీట్లు కేటాయించాలని లేదంటే తమకు స్పెషల్ బస్సులు వేసి, ఛార్జీలు తగ్గించాలంటున్నారు. మీ కామెంట్?

News August 31, 2025

‘ప్రాణహిత-చేవెళ్ల’తో రూ.60 వేల కోట్లు మిగిలేవి: మంత్రి ఉత్తమ్

image

TG: రూ.38,500 కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టి ఉంటే 16.50 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో అన్నారు. ‘ఆ ప్రాజెక్టుతో రూ.60వేల కోట్లు ఆదా అయ్యేవి. పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, దేవాదుల, సీతారాంసాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. ఇప్పటివరకు కాళేశ్వరం నీటిని ఎత్తిపోసినందుకు ఇరిగేషన్ శాఖ విద్యుత్ శాఖకు రూ.9,738 కోట్లు చెల్లించాల్సి ఉంది’ అని తెలిపారు.

News August 31, 2025

నాకు ఇంకా ఎంగేజ్మెంట్ కాలేదు: నివేదా

image

తనకు ఇంకా నిశ్చితార్థం కాలేదని హీరోయిన్ నివేదా పేతురాజ్‌ క్లారిటీ ఇచ్చారు. ‘అక్టోబరులో ఎంగేజ్మెంట్, జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నాం. డేట్స్ ఇంకా ఫైనల్ కాలేదు. రాజ్‌హిత్ ఇబ్రాన్‌ను ఐదేళ్ల క్రితం దుబాయ్‌లో కలిశాను. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. పెళ్లెందుకు చేసుకోకూడదు అని పరస్పరం ప్రశ్నించుకున్నాం’ అని తెలిపారు. రాజ్‌హిత్‌కు దుబాయ్‌లో వ్యాపారాలు ఉన్నాయి.