News August 5, 2024
ఆగస్టు 5: చరిత్రలో ఈరోజు

*1895: జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రాజకీయ సిద్ధాంతవాది ఫ్రెడరిక్ ఎంగెల్స్ మరణం
*1908: పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత చక్రపాణి జననం
*1930: చంద్రునిపై మొట్టమొదటిసారి కాలుమోపిన వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జననం
*1962: హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో మరణం
*1974: సినీ నటి కాజోల్ జననం
*1991: హోండా కంపెనీని స్థాపకుడు సొయిఛిరో హోండా మరణం
Similar News
News March 25, 2026
ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితి పెంచాలి: నిరుద్యోగ జేఏసీ

AP: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయో పరిమితిని 42 నుంచి 46 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్ధిక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో మ్యాగ్జిమమ్ ఏజ్ లిమిట్ 46 ఏళ్లుగా ఉందని, ఇక్కడ కూడా 46కి పెంచాలని కోరారు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
News March 25, 2026
రష్యా, ఇరాన్‌కు ఇజ్రాయెల్ షాక్

ఇరాన్‌కు అన్ని వనరులు కట్ చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇటీవల ఇరాన్-రష్యా మధ్య ఆయుధాల సరఫరాకు కీలకమైన కాస్పియన్ సముద్రం మార్గాన్ని టార్గెట్ చేసింది. ఇరాన్ నేవీ, మౌలికవసతులు ధ్వంసమయ్యేలా బందర్ అన్జాలీ పోర్టుపై దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఇరాన్ – రష్యాల మధ్య మిసైల్స్, డ్రోన్లు, గన్స్ మొదలైనవి సరఫరా కావడానికి ఈ పోర్టు కీలకం. ఈ దాడితో ఇరు దేశాలకు ఇజ్రాయెల్ భారీ నష్టం కలిగించింది.
News March 25, 2026
ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో నేటి నుంచి 3 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది. ఇవాళ మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు VZM, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, NTR, అన్నమయ్య, చిత్తూరు, TRPT జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది.


