News August 7, 2024

ఆగస్టు 7: చరిత్రలో ఈరోజు

image

1907: ఉమ్మడి ఏపీ రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి జననం
1925: హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్ జననం
1941: విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ మరణం
1947: తెలుగు హాస్య నటులు సుత్తివేలు జననం
1980: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ జననం
2018: తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మరణం
● నేడు జాతీయ చేనేత దినోత్సవం

Similar News

News April 10, 2026

ధనుష్-కృతి.. మరోసారి జోడీ!

image

ధనుష్, కృతి సనన్ జోడీగా గతేడాది రిలీజైన ‘తేరే ఇష్క్ మే’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ చేశారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. పీరియాడికల్ లవ్ స్టోరీని దర్శకుడు సిద్ధం చేస్తున్నారని టాక్. ఈ ఏడాది చివర్లోనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.

News April 10, 2026

IPL నుంచి హసరంగ ఔట్!

image

LSG స్టార్ స్పిన్నర్ హసరంగ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యారు. ఆయన భారత్‌కు రాలేడనే అంచనాతో ఒకట్రెండు రోజుల్లో వేరే ప్లేయర్‌ను తీసుకోనున్నట్లు టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ ప్రకటించారు. గతేడాది వేలంలో హసరంగను రూ.2 కోట్లకు LSG కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గాయంతో బాధపడుతున్న ఆయన శ్రీలంక బోర్డు నుంచి NOC పొందలేదు. హసరంగ స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ జార్జ్ లిండేను తీసుకునే అవకాశం ఉంది.

News April 10, 2026

ఈ నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ

image

AP: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 2026-27 ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్నుపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. అలాగే 2025-26 వరకు ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ సదుపాయాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.