News August 9, 2025
ఆగస్టు 9: చరిత్రలో ఈ రోజు

1889: భాషావేత్త, చరిత్రకారుడు చిలుకూరి నారాయణరావు జననం
1910: పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య జననం
1945: జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుదాడి
1948: వైద్య శాస్త్రజ్ఞుడు యల్లాప్రగడ సుబ్బారావు మరణం
1975: సినీ నటుడు మహేశ్ బాబు జననం
☛ అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం
☛ జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవం
Similar News
News August 9, 2025
ఛార్జీలు పెంచలేదు: TGSRTC

TG: రాఖీ పండుగ సందర్భంగా RTC బస్సుల్లో ఛార్జీలు పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ ఖండించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని, వాటిలో మాత్రమే 30% అదనపు ఛార్జీలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. రెగ్యులర్ బస్సుల్లో ఎలాంటి పెంపు లేదని పేర్కొంది. స్పెషల్ బస్సుల్లో ఛార్జీల పెంపు కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని, అన్ని పండగలకూ ఈ విధానాన్నే కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
News August 9, 2025
నేడు అల్లూరి జిల్లాలో సీఎం పర్యటన

AP: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఇవాళ అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించనున్నారు. ఉదయం గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో లగిశపల్లికి చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో వంజంగి గ్రామానికి వెళ్తారు. గిరిజన సంప్రదాయాలపై అడవి బిడ్డలతో ముచ్చటిస్తారు. అనంతరం ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని ప్రసంగిస్తారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత కూటమి నేతలతో భేటీ అవుతారు.
News August 9, 2025
ట్రంప్, పుతిన్ భేటీకి డేట్ ఫిక్స్

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో వచ్చే శుక్రవారం (ఆగస్టు 15న) సమావేశం కానున్నట్లు US ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ఈ భేటీ అలస్కాలో జరగనుందని వెల్లడించారు. అంతకుముందు ట్రంప్ సమక్షంలో ఆర్మేనియా, అజర్‌బైజాన్ దేశాధినేతలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ మధ్య కూడా సీజ్ ఫైర్ ఒప్పందం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.