News August 9, 2024

ఆగస్టు 9: చరిత్రలో ఈ రోజు

image

1910: పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య జననం
1945: జపాన్‌లోని నాగసాకి పట్టణంపై అమెరికా అణుబాంబు ప్రయోగించింది
1948: ప్రముఖ సైంటిస్ట్ యల్లాప్రగడ సుబ్బారావు మరణం
1965: సింగపూర్ స్వాతంత్ర్యం పొందింది
1975: సూపర్ స్టార్ మహేశ్ ‌బాబు జననం
✯ నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

Similar News

News November 27, 2025

తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై సీఎం రేవంత్ సమీక్ష

image

TG: తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై సమీక్షించిన సీఎం రేవంత్ అధికారులకు పలు సూచనలు చేశారు. ‘ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలి. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా విభజించుకోవాలి. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలి’ అని తెలిపారు.

News November 27, 2025

ట్రేడ్ మోసం.. ₹35 కోట్లు నష్టపోయిన పెద్దాయన

image

ట్రేడ్ ఫ్రాడ్ వల్ల ₹35 కోట్లు నష్టపోయారో వ్యాపారవేత్త. ముంబైకి చెందిన భారత్ హారక్‌చంద్ షా(72) వారసత్వంగా వచ్చిన షేర్లను 2020లో గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్స్ కంపెనీ డిమ్యాట్ అకౌంట్‌కు బదిలీ చేశారు. కంపెనీ ఉద్యోగులు ఆయన ఖాతాను చూసుకుంటామని చెప్పి 2020-24 మధ్య ఫ్రాడ్ చేశారు. ఈ క్రమంలో ₹35 కోట్ల అప్పు ఉందని కంపెనీ చెప్పడంతో ఆయన షాకయ్యారు. మొత్తం అప్పును చెల్లించిన షా.. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 27, 2025

ఇల్లు మూలల ఆధారంగా ఉంటే ఏ దిక్కున పడుకోవాలి?

image

ఇల్లు మూలలకు ఉన్నప్పుడు నైరుతి మూలకు తల, ఈశాన్య మూలకు కాళ్లు పెట్టుకుని పడుకోవడం మంచిదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది చక్కటి నిద్రకు, ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ‘నైరుతి స్థిరమైన శక్తినిస్తుంది. ఈశాన్యం నుంచి పాదాల ద్వారా శుభకరమైన కాస్మిక్ శక్తిని స్వీకరించడానికి సహాయపడుతుంది. అలాగే పనుల పట్ల ఏకాగ్రతను పెంచుతుంది’ అని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>