News September 10, 2024
16 ఏళ్లు నిండనివారు సోషల్‌మీడియా వాడొద్దన్న AUS ప్రభుత్వం!

సోషల్‌మీడియా వినియోగం పిల్లలను తప్పుదారి పట్టిస్తోందని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం 16 ఏళ్లు నిండనివారు సోషల్‌మీడియా వినియోగించకుండా నిషేధం విధించనుంది. మొబైల్‌కే పరిమితం కాకుండా పిల్లలు మైదానంలోకి వచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పీఎం వెల్లడించారు. ఫేస్బుక్, ఇన్‌స్టా, టిక్‌టాక్ తదితర యాప్స్‌ను పిల్లలు వాడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News January 5, 2026
బెండలో కాయ తొలుచు పురుగు నివారణ ఎలా?

బెండ మొక్క పెరుగుదల దశలో కాయ తొలిచే పురుగు మొక్క మొవ్వును, పూతను, కోత దశలో కాయలను తొలిచి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. పురుగు ఆశించిన కొమ్మలను, పురుగు ఆశించిన చోట నుంచి అంగుళం కిందికి తుంచి తొలగించాలి. వీటి నివారణకు కాయలు కోసిన తర్వాత లీటర్ నీటిలో 3గ్రా. కార్బరిల్ (లేదా) 2 మి.లీ. క్వినాల్ఫాస్ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 5, 2026
HOT TOPIC: ఆంధ్రకూ పాకిన జలజగడం…

TGలో INC, BRSల వరకే ఉన్న జలజగడం కాస్తా APకీ పాకింది. YCP విమర్శలతో ‘రాయలసీమ లిఫ్ట్’ పై రేవంత్ చేసిన కామెంట్లను AP GOVT ఖండించింది. దానివల్లే తాను TDPని వదిలానని రేవంత్ విమర్శలు చేశారు. దీంతో నదీ జలాలపై రిప్లైకి CBN సిద్ధమవుతున్నారు. అటు ఈ అంశాన్ని రాజకీయాస్త్రంగా మలుచుకొనేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు. ఏదేమైనా నదీ జలాలపై వేడెక్కిన రాజకీయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
News January 5, 2026
OTTలోకి ‘ధురంధర్’.. ఎప్పుడంటే?

రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇండియాలో రూ.800కోట్లకు పైగా కలెక్ట్ చేసిన తొలి హిందీ సినిమాగా ‘ధురంధర్’ నిలిచింది. ఇందులో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటనకు ప్రశంసలొచ్చాయి.


