News January 2, 2025

శుభ ముహూర్తం (02-01-2025)

image

✒ తిథి: శుక్ల తదియ తె.2:26 వరకు
✒ నక్షత్రం: శ్రవణం రా.12.53 వరకు
✒ శుభ సమయం: ఉ 10.24- 11.12.. తిరిగి సా.5.24-6.12
✒ రాహుకాలం: మ.1.30- 3.00
✒ యమగండం: ఉ.6.00- 07.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-10.48 తిరిగి మ.2.48-3.36
✒ వర్జ్యం: ఉ.7.00 వరకు
✒ అమృత ఘడియలు: మ.3.20-4.52

Similar News

News January 27, 2026

ఇంటర్వ్యూతో ESIC ఫరీదాబాద్‌లో 50 పోస్టులు

image

<>ESIC<<>> మెడికల్ హాస్పిటల్, ఫరీదాబాద్‌ 50 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 28న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS+ MD/MS/MCh/DM/DrNB/FNB అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం రూ.1,48,669 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

News January 27, 2026

ఒకే రోజు రూ.63 కోట్ల కలెక్షన్లు

image

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బార్డర్-2’ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. నిన్న ఒక్క రోజే ఈ మూవీకి రూ.63 కోట్ల కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ తెలిపారు. మొత్తంగా నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.193.48 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని పేర్కొన్నారు. అనురాగ్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీలో వరుణ్ ధవన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రలు పోషించారు.

News January 27, 2026

మోదీ ట్వీట్.. వివాదాస్పదంగా అనువదించిన గ్రోక్

image

మాల్దీవ్స్‌కు థాంక్స్ చెబుతూ PM మోదీ చేసిన ట్వీట్‌ను <<18752905>>‘గ్రోక్’<<>> తప్పుగా అనువదించింది. ‘రిపబ్లిక్ డే వేడుకలు మాల్దీవ్స్‌లో జరిగాయి. ఈ సుకురియా ప్రభుత్వం భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటోంది. భారత వ్యతిరేక ప్రచారాల్లో ముందుంది’ అన్నట్లు ట్రాన్స్‌లేట్ చేసింది. నిజానికి మోదీ 2 దేశాల ప్రయోజనాల కోసం కలిసి పని చేద్దామని, మాల్దీవుల ప్రజలందరికీ శ్రేయస్సు, ఆనందంతో నిండిన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.