News January 4, 2025
శుభ ముహూర్తం (04-01-2025)

✒ తిథి: శుక్ల పంచమి రా.11:13 వరకు
✒ నక్షత్రం: శతభిషం రా.10.59 వరకు
✒ శుభ సమయం: ఉ.11.35-12.11, సా.4.34-5.23
✒ రాహుకాలం: ఉ.9.00- 10.30
✒ యమగండం: మ.1.30- 3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36
✒ వర్జ్యం: ఉ.6.58-8.29
✒ అమృత ఘడియలు: సా.4.07-5.38
Similar News
News November 23, 2025
నిజామాబాద్ జిల్లా నుంచే కాంగ్రెస్ పతనం: జీవన్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోట అని, కాంగ్రెస్ పతనాన్ని నిజామాబాద్ గడ్డ నుంచే శాసిస్తామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి చేసేవరకు నిద్రబోమన్నారు. ఒంటరిగానే పోటీ చేసి వంద సీట్లతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసి డ్యూటీకెక్కుతామన్నారు.
News November 23, 2025
TODAY HEADLINES

* సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము
* డ్రగ్స్-టెర్రర్ లింక్‌ను నాశనం చేయాలి: మోదీ
* సత్యసాయి బాబా సిద్ధాంతాలే నిజమైన విద్య: ఉప రాష్ట్రపతి
* అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ సాకారం కాలేదు: రేవంత్
* కొత్త లేబర్ కోడ్‌లు.. గొప్ప సంస్కరణల్లో ఒకటి: CBN
* TG పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల
* బెంగళూరులో ప్రైవేట్ ఈవెంట్‌లో ఒకే వేదికపై జగన్, కేటీఆర్
News November 23, 2025
ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదు: శ్రీధర్ బాబు

TG: ఆరోపణలు చేయడం, అబద్ధాలు చెప్పడం కేటీఆర్, <<18359759>>హరీశ్<<>> రావుకు అలవాటేనని మంత్రి శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. భూముల ధరలపై చేస్తున్న వ్యాఖ్యలు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఫ్రీ హోల్డ్ జీవోల వెనుక ఉన్న రూ.లక్షల కోట్ల మతలబు ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.


