News March 6, 2025
శుభ ముహూర్తం (06-03-2025)

☛ తిథి: శుక్ల సప్తమి, మ.3.39 వరకు
☛ నక్షత్రం: రోహిణి, తె.4.24 వరకు
☛ శుభ సమయం: ఏమీ లేవు
☛ రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు
☛ యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.10.00-నుంచి 10.48 వరకు, మ.2.48 నుంచి 3.36 వరకు
☛ వర్జ్యం: రా.8.31 నుంచి 10.05 వరకు
☛ అమృత ఘడియలు: రా.1.15 గంటల నుంచి 2.49 వరకు
Similar News
News January 9, 2026
విద్యుత్ ఛార్జీలపై సీఎం గుడ్ న్యూస్

AP: కూటమి అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో యూనిట్ విద్యుత్ ₹5.19గా ఉండేదని, దాన్ని ₹4.90కి తగ్గించామని సీఎం చంద్రబాబు చెప్పారు. మార్చి నాటికి మరో 10 పైసలు, మూడేళ్లలో ₹1.19 తగ్గించి యూనిట్ ₹4కే అందిస్తామన్నారు. 2019-24 నాటి ట్రూఅప్ ఛార్జీల భారం ₹4,498 కోట్లను ప్రభుత్వమే భరించే నిర్ణయాన్ని క్యాబినెట్లో ఆమోదం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కమీషన్ల కోసం గందరగోళ నిర్ణయాలు అమలు చేసిందని విమర్శించారు.
News January 9, 2026
కుబేర యోగాన్ని పొందడం ఎలా?

జాతకంలో ఈ యోగం లేకపోయినా కొన్ని పరిహారాలతో కుబేరుడి అనుగ్రహం పొందవచ్చు. రోజూ ఇంట్లో ఉత్తర దిశలో ‘కుబేర యంత్రం’ ఉంచి పూజిస్తే ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి. కుబేర ముద్రను ధ్యానంలో ఉపయోగించడం, లక్ష్మీ కుబేర మంత్రాన్ని 108 సార్లు పఠించడం శ్రేయస్కరం. ఆకుపచ్చ రంగు వస్తువులను దగ్గర ఉంచుకోవడం, పేదలకు దానధర్మాలు చేయడం ద్వారా కుబేర శక్తిని ఆకర్షించవచ్చు. మనసులో దృఢ సంకల్పం, శ్రమ ఉంటే ఈ యోగం తప్పక ఫలిస్తుంది.
News January 9, 2026
సంక్రాంతికి ఫ్రీ టోల్ లేనట్లే!

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. పండుగ రోజుల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫ్రీగా ప్రకటించాలని TG మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, TDP ఎంపీ సానా సతీశ్ బాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అయితే ఈ హైవేపై ఉచిత టోల్కు అనుమతి ఇవ్వలేమని కేంద్రం తెలియజేసినట్లు సమాచారం.


