News April 6, 2025

శుభ ముహూర్తం (06-04-2025)(ఆదివారం)

image

తిథి: శుక్ల నవమి రా.11.38 వరకు
నక్షత్రం: పునర్వసు ఉ.9.58 వరకు
రాహుకాలం: సా.4.30-సా.6.00 వరకు
యమగండం: మ.12.00-మ.1.30 వరకు
దుర్ముహూర్తం: సా.4.25-సా.5.13 వరకు
వర్జ్యం: సా.6.03-సా.7.39 గంటల వరకు
అమృత ఘడియలు: ఉ.7.37-ఉ.9.09 వరకు

Similar News

News April 6, 2025

తెలంగాణకు అన్యాయం జరగనివ్వం: ఉత్తమ్

image

TG: కృష్ణా, గోదావరి జలాలపై ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగే న్యాయవిచారణకు తాను హాజరవుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జలవివాదాలపై వాదనలు వినిపిస్తున్న న్యాయబృందంతో ఆయన చర్చలు జరిపారు. ‘నీటి కేటాయింపులు సరిగ్గా లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్న నిర్ణయాలను సరిచేస్తాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఒక్క అవకాశం కూడా వదులుకోం’ అని ఉత్తమ్ స్పష్టం చేశారు.

News April 6, 2025

రిటైర్మెంట్ ప్రచారంపై స్పందించిన ధోనీ

image

IPLకు తాను రిటైర్మెంట్ ప్రకటిస్తానని జరుగుతున్న ప్రచారంపై CSK స్టార్ ప్లేయర్ MS ధోనీ స్పందించారు. ‘ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. ఇంకా ఆడుతున్నాను. ఈ జులై నాటికి నాకు 44 ఏళ్లు వస్తాయి. తదుపరి సీజన్ ఆడాలా, వద్దా? అనేది నిర్ణయించుకునేందుకు మరో 10 నెలల సమయం ఉంది. ఆడగలనా, లేదా? అనేది నిర్ణయం శరీరం అందించే సహకారం బట్టి తీసుకుంటా’ అని రాజ్ షమానీతో జరిగిన పాడ్‌కాస్ట్‌లో MSD వెల్లడించారు.

News April 6, 2025

అమిత్ షా చెప్పులు మోసిన చరిత్ర సంజయ్‌ది: మహేశ్ కుమార్

image

TG: కాంగ్రెస్, సీఎం రేవంత్‌పై <<16012655>>విమర్శలు చేసిన<<>> బండి సంజయ్‌పై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైరయ్యారు. రాష్ట్ర BJP అధ్యక్షుడిగా ఉండి అమిత్ షా చెప్పులు మోసిన చరిత్రను మర్చిపోయావా? అని నిలదీశారు. బీజేపీలో ఉనికి కోసం బండి ఆరాటపడుతున్నారని, మోదీ, షా అనుమతి లేనిదే ఆయన టిఫిన్ కూడా చెయ్యరని ఎద్దేవా చేశారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక బీఆర్ఎస్‌తో బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు.

error: Content is protected !!