News February 7, 2025
శుభ ముహూర్తం(07-02-2025)
✒ తిథి: శుక్ల దశమి రా.11.09 వరకు
✒ నక్షత్రం: రోహిణి రా.8.32 వరకు
✒ శుభ సమయాలు: ఉ.9.23 నుంచి 9.53 వరకు, సా.4.23-4.35 వరకు
✒ రాహుకాలం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి ఉ.9.12 వరకు, మ.12.24 నుంచి 1.12 వరకు
✒ వర్జ్యం: రా.1.53 నుంచి మ.3.24 వరకు
✒ అమృత ఘడియలు: సా.5.30 నుంచి 7.00 వరకు
Similar News
News February 7, 2025
క్రీడాకారులకు రూ.7.96 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల
AP: రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 189 మందికి రూ.7.96 కోట్ల ప్రోత్సాహాలను విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం 224 మందికి రూ.11.68 కోట్ల ఇన్‌సెంటీవ్‌లను పెండింగ్‌లో పెట్టిందని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో రూ.7.96 కోట్లను రిలీజ్ చేశారని తెలిపారు.
News February 7, 2025
కోహ్లీ ఫిట్‌నెస్‌పై మాజీ క్రికెటర్ సెటైర్లు
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సెటైర్లు వేశారు. ‘జనవరిలో మెడ నొప్పి.. ఫిబ్రవరిలో మోకాలు నొప్పి.. ఇదేం ఫిట్‌నెస్.. ఏదైతేనేం కటక్ మ్యాచ్ నాటికి కోహ్లీ పూర్తిగా కోలుకోవాలి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో మోకాలి గాయం కారణంగా కోహ్లీ బరిలోకి దిగని విషయం తెలిసిందే. ఆయన స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడారు.
News February 7, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!
తాత్పర్యం: నేలమీద పచ్చికాయలను ఏరుకుని తినవద్దు. బంధువులను, ప్రజలను దూషించవద్దు. యుద్ధము నుంచి వెనుతిరిగి పారిపోరాదు. పెద్దల ఆజ్ఞను అతిక్రమించరాదు.