News July 9, 2025

శుభ సమయం (09-07-2025) బుధవారం

image

✒ తిథి: శుక్ల చతుర్దశి రా.1.02 వరకు తదుపరి పూర్ణిమ
✒ నక్షత్రం: మూల తె.5.13 వరకు తదుపరి పూర్వాషాడ
✒ శుభ సమయం: ఏమీలేవు
✒ రాహుకాలం: మ.12.00-1.30 వరకు
✒ యమగండం: ఉ.7.30-9.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.11.36.మ.12.24 వరకు
✒ వర్జ్యం: మ.11.59-1.41 వరకు తిరిగి తె.3.30-5.12 వరకు
✒ అమృత ఘడియలు: రా.10.20-12.02 వరకు

Similar News

News July 9, 2025

నేడు క్యాబినెట్ భేటీ

image

AP: ఈరోజు ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. రాజధాని కోసం మలివిడతలో 20,494 ఎకరాల భూ సమీకరణ, 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై చర్చించనుంది. అమరావతికి ఇసుకను డ్రెడ్జింగ్ చేసుకునేందుకు CRDAకు అనుమతి ఇవ్వనుంది.

News July 9, 2025

ఇవాళ గెలిస్తే సిరీస్ మనదే..

image

ఇంగ్లండ్‌తో భారత మహిళల జట్టు మాంచెస్టర్‌లో ఇవాళ నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. 2-1తో లీడింగ్‌లో ఉన్న టీమ్ ఇండియా సిరీస్‌పై కన్నేసింది. షెఫాలీ తిరిగి ఫామ్‌లోకి రావడం భారత్‌కు ప్లస్. బౌలర్లు సత్తా చాటుతుండగా బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడాల్సిన అవసరముంది. మరోవైపు మూడో T20లో గెలుపుతో ఇంగ్లండ్ జోరు మీద ఉంది. ఇవాళ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆ జట్టు చూస్తోంది. మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది.

News July 9, 2025

రేపు మరో 9.51 లక్షల మందికి ‘తల్లికి వందనం’

image

AP: రేపు మరో 9.51 లక్షలమంది విద్యార్థులకు తల్లికి వందనం డబ్బు జమ చేయనున్నారు. ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్, కేంద్రీయ విద్యాలయాలు, CBSE, నవోదయ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇటీవల వీరిని మినహాయించి మిగిలిన వారికి నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించగా 1.34 లక్షల మంది అర్హులుగా తేలారు. వారికీ రేపు నగదు జమ చేయనున్నారు.