News August 9, 2025
శుభ సమయం (09-08-2025) శనివారం

✒ తిథి: పూర్ణిమ మ.1.31 వరకు
✒ నక్షత్రం: శ్రవణం మ.3.31 వరకు
✒ శుభ సమయం: ఉ.10.30-మ.12.00, మ.3.00-సా.4.50
✒ రాహుకాలం: ఉ.9.00-ఉ.10.30
✒ యమగండం: మ.1.30-మ.3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36
✒ వర్జ్యం: రా.7.30-రా.9.03
✒ అమృత ఘడియలు: సా.5.06-సా.6.40
Similar News
News August 9, 2025
‘WAR-2’లో షారుఖ్, సల్మాన్?

‘WAR-2’ సినిమా పోస్ట్ క్రెడిట్ సీన్‌లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆలియా భట్, శార్వరి కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ‘స్పై యూనివర్స్’లో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ గతంలో షారుఖ్, సల్మాన్ హీరోలుగా సినిమాలు నిర్మించింది. ‘WAR2’ కూడా అదే యూనివర్స్ నుంచి వస్తుండగా.. ఆలియా, శార్వరిలతో ‘ఆల్ఫా’ అనే మూవీ తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌లో వీరందరిని ఒకే మూవీలో చూపించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
News August 9, 2025
HDFC కస్టమర్లకు గుడ్‌న్యూస్

HDFC బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(MCLR)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇది రుణ కాలపరిమితిని బట్టి 8.55%-8.75% మధ్య ఉండనుంది. ఓవర్ నైట్/ఒక నెల MCLR 8.60% నుంచి 8.55%కి, 3 నెలలకు 8.65% నుంచి 8.60%కి, 6 నెలలకు 8.75% నుంచి 8.70%కి, ఏడాది MCLR 9.05% నుంచి 8.75%కి తగ్గింది. ఈ తగ్గింపు ఈ నెల 7 నుంచి అమల్లోకి రాగా లోన్ల EMI చెల్లించే వారికి స్వల్ప ఊరట దక్కనుంది.
News August 9, 2025
EP31: కుటుంబ పెద్ద ఇలా నడుచుకోవాలి: చాణక్య నీతి

కుటుంబం బాగుండాలంటే కుటుంబ పెద్ద కొన్ని సూత్రాలు పాటించాలని చాణక్య నీతి చెబుతోంది. ‘ఇతరుల మాటలకు ప్రభావితం కాకూడదు. పుకార్లను నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలి. ఇంటి సభ్యులతో స్పష్టంగా మాట్లాడాలి. డబ్బును వృథా చేయవద్దు. ఇంట్లో వారికి డబ్బు నిర్వహణపై అవగాహన కల్పించాలి. కుటుంబంలో అందరినీ సమానంగా చూడాలి. ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండాలి. కుటుంబ సంక్షేమం కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలి’ అని బోధిస్తోంది.