News April 10, 2025
శుభ ముహూర్తం (10-04-2025)(గురువారం)

తిథి: శుక్ల త్రయోదశి రా.1.01 వరకు
నక్షత్రం: పుబ్బ మ.12.57 వరకు
శుభసమయం: ఉ.11.04-ఉ.11.40, సా.5.02-సా.6.02 వరకు
రాహుకాలం: మ.1.30-మ.3.00 వరకు
యమగండం: ఉ.6.00-ఉ.7.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48, మ.2.48-3.36 వరకు
వర్జ్యం: రా.8.44-రా.10.28 వరకు
అమృత ఘడియలు: ఉ.6.06-ఉ.7.48 వరకు
Similar News
News April 18, 2025
రాష్ట్రంలో సహజ ప్రసవాలు అంతంతే..

AP: రాష్ట్రంలో సాధారణ ప్రసవాల కంటే శస్త్రచికిత్స ప్రసవాలు అధికమవుతున్నాయని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. సాధ్యమైనంత వరకూ సహజ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని గైనకాలజిస్టులకు సూచించింది. తొలి కాన్పు సిజేరియన్ అయినప్పటికీ రెండో కాన్పు సహజ ప్రసవం చేసేలా చూడాలంది. కాగా సిజేరియన్లలో దేశంలోనే AP 2వ స్థానంలో ఉంది.
News April 18, 2025
ఆ కుక్క ధర రూ.50కోట్లు కాదు: ఈడీ

బెంగళూరుకు చెందిన సతీశ్ అనే వ్యక్తి ఇటీవల రూ.50కోట్లకు ఓ కుక్కను కొన్నారన్న వార్త SMలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అది కాస్తా ED దృష్టికి వెళ్లడంతో అతని ఇంటిపై దాడి చేసింది. రూ.50 కోట్లు ఎలా వచ్చాయనే లావాదేవీలపై విచారణ జరిపి, వాస్తవాలను బయటపెట్టింది. కాకేసియన్ షెపర్డ్ జాతికి చెందిన ఆ శునకం ధర రూ. లక్ష కూడా ఉండదని తేల్చి చెప్పింది. కేవలం ప్రచారం కోసమే అతను గొప్పలు చెప్పుకుంటున్నట్లు వివరించింది.
News April 18, 2025
జీవిత ఖైదీలకు సర్కార్ గుడ్‌న్యూస్

AP: రాష్ట్రంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న జీవితఖైదీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు అర్హులైన ఖైదీల పేర్లు సిద్ధం చేయాలంటూ జైళ్ల శాఖ DG అంజనీ కుమార్‌ను ఆదేశించింది. ఎంపిక చేసిన ఖైదీలు రూ.50వేల ష్యూరిటీతోపాటు శిక్షాకాలం పూర్తయ్యే వరకూ స్థానిక PSలో 3నెలలకోసారి సంతకం చేయాలి. మళ్లీ నేరానికి పాల్పడితే క్షమాభిక్ష రద్దవుతుంది.