News March 13, 2025
శుభ ముహూర్తం (13-03-2025)

☛ తిథి: శుక్ల చతుర్దశి ఉ.10.15 వరకు
☛ నక్షత్రం: పుబ్బ తె.5.37 వరకు
☛ శుభ సమయం: 1.ఉ.10.49-11.19 వరకు
2.సా.5.43-6.31 వరకు
☛ రాహుకాలం: మ.1.30-3.00 వరకు
☛ యమగండం: ఉ.6.00-7.30 వరకు
☛ దుర్ముహూర్తం: 1.ఉ.11.36-12.24 వరకు
☛ వర్జ్యం: మ.12.40-1.21 వరకు
☛ అమృత ఘడియలు: రా.10.50-12.30 వరకు
Similar News
News September 16, 2025
పంట దిగుబడిని పెంచే నానో ఎరువులు

వ్యవసాయంలో చాలా కాలంగా రైతులు సంప్రదాయ యూరియా, DAPలను ఘన రూపంలో వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూపంలో నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని సూచించిన పరిమాణంలో నీటితో కలిపి పిచికారీ చేస్తే.. ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90 శాతం గ్రహిస్తాయి. దీని వల్ల ఎరువు నష్టం తగ్గి దిగుబడులు పెరుగుతాయని IFFCO చెబుతోంది.
News September 16, 2025
నానో ఎరువులను ఎలా వాడాలి?

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.
News September 16, 2025
నానో ఎరువులను ఎప్పుడు పిచికారీ చేయాలి?

వరిలో నానో యూరియా, నానో DAPలను కలిపి పిలకలు తొడిగే దశలో, చిరు పొట్ట దశలో పిచికారీ చేసుకోవచ్చు. కూరగాయలు, పప్పు దినుసుల పంటల్లో మొక్కల రెమ్మలు వచ్చే దశ, పూత దశలో స్ప్రే చేసుకోవచ్చు. పండ్ల తోటల్లో మామిడి పూతకు ముందు డిసెంబరు నెలలో నానో DAP స్ప్రే చేయడం వల్ల పూత పెరిగి మంచి దిగుబడులు వచ్చాయని రైతులు చెబుతున్నారు. కాబట్టి పండ్ల తోటల్లో పూతకు ముందు నానో DAPని పిచికారీ చేసి మంచి ఫలితాలను పొందవచ్చు.