News April 13, 2025
శుభ ముహూర్తం (13-04-2025)(ఆదివారం)

తిథి: బహుళ పాడ్యమి పూర్తి.. నక్షత్రం: చిత్త రా.7.40 వరకు తదుపరి స్వాతి.. శుభసమయం: ఉ.8.25 నుంచి 9.01 వరకు తిరిగి మ.2.50 నుంచి 3.02.. రాహుకాలం: సా.4.30-6.00 వరకు.. యమగండం: మ.12.00-మ.1.30 వరకు దుర్ముహూర్తం: సా.4.25-ఉ.5.13 వరకు వర్జ్యం: రా.1.52-తె.3.38 వరకు అమృత ఘడియలు: ఉ.12.35 నుంచి 2.21 వరకు
Similar News
News April 13, 2025
తజికిస్థాన్‌లో భూకంపం

తజికిస్థాన్‌లో ఇవాళ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. 16 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై సమాచారం రావాల్సి ఉంది. మయన్మార్‌లోనూ ఇవాళ మరోసారి భూమి కంపించిన విషయం తెలిసిందే.
News April 13, 2025
మహాయుతి కూటమిలో విభేదాలు?

మహాయుతి కూటమిలో విభేదాలు తలెత్తాయని ప్రచారానికి తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటన బలం చేకూరుస్తుంది. ఛత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా NCP ఎంపీ సునీల్ తత్కరీ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొనగా శివసేన నేతలెవరూ హాజరుకాలేదు. కాగా తాను ఆహ్వానించినప్పటికీ నేతలెవరూ విందుకు రాలేదని NCP ఎంపీ అన్నారు. దీంతో భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమిలో ముసలం పుట్టిందని వార్తలు ప్రచారమవుతున్నాయి.
News April 13, 2025
రాజీవ్ యువ వికాసం.. ఒక్క రోజే ఛాన్స్

TG: <<15856039>>రాజీవ్ యువ వికాసం<<>> పథకానికి నిన్నటి వరకు దాదాపు 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలతో దరఖాస్తుదారులు ఇబ్బందిపడుతున్నారు. రేపటితో గడువు ముగియనుండగా మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతున్నారు. ఈ స్కీమ్‌కు అప్లై చేసుకునేందుకుగాను క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్ల కోసం మార్చి 24-ఏప్రిల్ 11 మధ్య 13.08 దరఖాస్తులు వచ్చాయి. మీసేవ చరిత్రలో ఇదే రికార్డని తెలుస్తోంది.