News September 13, 2025
శుభ సమయం (13-09-2025) శనివారం

✒ తిథి: బహుళ షష్ఠి ఉ.11.17 వరకు
✒ నక్షత్రం: కృత్తిక మ.2.55 వరకు
✒ శుభ సమయములు: లేవు
✒ రాహుకాలం: ఉ.9.00-ఉ.10.30
✒ యమగండం: మ.1.30-మ.3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36
✒ వర్జ్యం: తె.5.47లగాయతు
✒ అమృత ఘడియలు: మ.12.40-మ.2.09
Similar News
News February 7, 2026
ట్రేడ్ డీల్.. మన రైతుకు రక్షణ!

అమెరికాతో ట్రేడ్ డీల్‌లో పలు వ్యవసాయ ఉత్పత్తులను మినహాయించారు. US నుంచి ఎగుమతయ్యే మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, చీజ్, ఇథనాల్(ఫ్యూయల్), పొగాకు, పలు కూరగాయలు, మాంసంపై గతంలో ఉన్న రూల్స్ కొనసాగుతాయి. వీటిపై టారిఫ్ డిస్కౌంట్స్ ఉండవు. US వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తే భారత రైతులపై పెను ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో వ్యవసాయ, పాల ఉత్పత్తులను డీల్‌లో చేర్చలేదు.
News February 7, 2026
వెనక్కి తగ్గిన ‘జన నాయగన్’ టీమ్?

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జనవరి 9న రావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే CBFC సూచనల మేరకు పలు మార్పులకు చిత్ర నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి 19 లేదా 20న సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. అధికారిక ప్రకటన కోసం విజయ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు
News February 7, 2026
వైభవ్‌ను అరెస్ట్ చేసి వారిని కాపాడాలని పోస్ట్.. తర్వాత

హరారే వేదికగా నిన్న జరిగిన U-19 WC 2026 ఫైనల్‌లో చెలరేగి ఆడిన భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని అరెస్ట్ చేయాలని ఐస్‌ల్యాండ్ క్రికెట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘ఎవరైనా వైభవ్‌ను ఇప్పుడే అరెస్ట్ చేయండి. గ్రౌండ్‌లో ఇంగ్లండ్ బౌలర్లపై ఈ ఊచకోత ఎక్స్ రేటెడ్’ అని పేర్కొంది. మ్యాచ్ జరుగుతుండగా సరదాగా చేసిన ఈ ట్వీట్ SMలో వైరలైంది. WC విజయం అనంతరం టీమ్‌ఇండియా, వైభవ్‌ను అభినందిస్తూ మరో పోస్ట్ పెట్టింది.


