News October 14, 2025
శుభ సమయం (14-10-2025) మంగళవారం

✒ తిథి: బహుళ అష్టమి సా.4.05 వరకు
✒ నక్షత్రం: పునర్వసు సా.5.24 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేవు
✒ రాహుకాలం: మ.3.00-సా.4.30
✒ యమగండం: ఉ.9.00-ఉ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: శే.ఉ.7.23 వరకు, పునః రా.1.10-రా.2.43
✒ అమృత ఘడియలు: మ.3.06-మ.4.38 * ప్రతిరోజూ పంచాంగం, <<-1>>రాశిఫలాల<<>> కోసం క్లిక్ చేయండి.
Similar News
News February 1, 2026
గుడి మాఢవీధుల పక్కనే ఇల్లు ఉండవచ్చా?

దేవాలయానికి అతి సమీపంలో నివాస గృహాలు ఉండటం అంత శ్రేయస్కరం కాదంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. ‘మాడవీధి దాటి ఇల్లు ఉండాలి. ఇంట్లో నిత్యం జరిగే జనన, మరణాల వంటి అశౌచాలు లేదా ఇతర లౌకిక కార్యకలాపాల వల్ల కలిగే ప్రతికూల ప్రభావం దేవాలయ పవిత్రతకు భంగం కలిగించవచ్చు. అందుకే ఆధ్యాత్మిక శక్తికి, మానవ జీవనానికి మధ్య మాడవీధి ఓ రక్షణ సరిహద్దుగా ఉంటూ, దోషాలు తగలకుండా కాపాడుతుంది’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 1, 2026
ఆస్ట్రేలియాతో సిరీస్.. క్లీన్‌స్వీప్ చేసిన పాక్

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లోనూ పాకిస్థాన్ 111 పరుగుల తేడాతో విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 96 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను పాక్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన పాక్ ప్లేయర్ బాబర్.. T20Iలలో అత్యధిక అర్ధ శతకాలు(39) చేసిన ఆటగాడిగా నిలిచారు. ఈ క్రమంలో కోహ్లీ(38) రికార్డును బద్దలుకొట్టారు.
News February 1, 2026
KCRతో కేటీఆర్, హరీశ్ రావు భేటీ

TG: సిట్ విచారణ అనంతరం BRS అధినేత KCRతో కేటీఆర్, హరీశ్ రావు, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి కీలక నేతలు సహా లాయర్లు భేటీ అయ్యారు. విచారణ జరిగిన తీరు, అధికారుల ప్రశ్నల సరళిపై చర్చిస్తున్నారు. తర్వాత పరిణామాలపై డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు BRS భవన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు KCR రాకకోసం వేచిచూస్తున్నారు.


