News January 16, 2025
శుభ ముహూర్తం (16-01-2025)

✒ తిథి: బహుళ తదియ తె.4.25 వరకు
✒ నక్షత్రం: ఆశ్లేష మ.12.02 వరకు
✒ శుభ సమయం: ఏమి లేవు
✒ రాహుకాలం: ప.1.30-3.00 వరకు
✒ యమగండం: ఉ.6.00-7.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1.ఉ.10.00-10.48 వరకు
2.మ.2.48-3.36 వరకు
✒ వర్జ్యం: రా.12.42-2.23 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.10.22-12.01 వరకు
Similar News
News November 11, 2025
తిరుమలలో మీకు ఈ ప్రాంతం తెలుసా?

7 కొండలపై ఎన్నో వింతలున్నాయి. అందులో ‘అవ్వచారి కోన’ ఒకటి. ఇది తిరుమలకు నడిచి వెళ్లే పాత మెట్ల మార్గంలో మోకాళ్ల మిట్టకు ముందు ఉండే ఓ లోతైన లోయ. పచ్చని చెట్లతో దట్టంగా, రమణీయంగా కనిపిస్తుంది. ఈ ప్రదేశానికి ఆ పేరు రావడానికి కారణం అవ్వాచారి అనే భక్తుడు. ఆయన ప్రేరణగా ఈ లోయకు ‘అవ్వాచారి కోన’ అనే పేరొచ్చిందని చెబుతారు. ఈ లోయ తిరుమల యాత్రలో భక్తులు దాటే ముఖ్యమైన ఘట్టంగా పరిగణిస్తారు.<<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 11, 2025
ప్రెగ్నెన్సీలో ప్రయాణాలు చేయొచ్చా?

ప్రెగ్నెన్సీలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మొదటి 3నెలలు ప్రయాణాలు చేయకపోవడం మంచిది. తర్వాతి నెలల్లో ప్రయాణాలు చేసినా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికి వెళ్లినా రిపోర్టులు వెంట ఉంచుకోవాలి. కారులో వెళ్లే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మధ్యమధ్యలో కాస్త నడవడం వంటివి చేయాలి. వదులుగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ధరించాలి. కాళ్లకి స్టాకింగ్స్ వేసుకోవాలి.
News November 11, 2025
మళ్లీ తల్లి పాత్రలో నటించను: మీనాక్షి చౌదరి

తన గురించి ఏమైనా చెప్పాలంటే సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తానని, రూమర్లు సృష్టించాల్సిన అవసరం లేదని హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలిపారు. ‘లక్కీ భాస్కర్ కథ నచ్చి తల్లి క్యారెక్టర్ చేశా. ఇక అటువంటి పాత్రలు వస్తే నిర్మొహమాటంగా నో చెప్పేస్తా. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న ‘విశ్వంభర’ నా కెరీర్లో స్పెషల్ చాప్టర్గా నిలిచిపోతుంది. సీనియర్ హీరోలతో నటించడానికి ఇబ్బంది లేదు’ అని మీనాక్షి చెప్పారు.


