News August 18, 2025
శుభ సమయం (18-08-2025) సోమవారం

✒ తిథి: బహుళ దశమి సా.6.14 వరకు
✒ నక్షత్రం: మృగశిర తె.3.43 వరకు
✒ శుభ సమయం: ఉ.6.37-9.13, రా.7.49-8.13 వరకు
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12, మ.2.46-3.34 వరకు
✒ వర్జ్యం: ఉ.9.20-11.50 వరకు
✒ అమృత ఘడియలు: రా.7.05-8.37 వరకు
Similar News
News August 18, 2025
వ్యవసాయ కూలీల పిల్లలకు 15% సీట్లు

TG: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో వ్యవసాయ కూలీల పిల్లలకు 15% సీట్లు కేటాయించినట్లు రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు. నాలుగో తరగతి-ఇంటర్ వరకు కనీసం నాలుగేళ్లు ప్రభుత్వ స్కూల్, కాలేజీలో చదివిన వారు ఇందుకు అర్హులన్నారు. దీంతోపాటు MGNREGA కార్డు, తల్లిదండ్రులకు ఎకరం లోపు భూమి ఉన్నవారు అర్హులని వివరించారు. ఈ నెల 19-23 వరకు తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
News August 18, 2025
భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో సెలవు

AP: భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
News August 18, 2025
అవినీతిపై ప్రశ్నించినందుకే నాపై ఆరోపణలు: MLA కూన

AP: శ్రీకాకుళం(D) పొందూరు KGBV ప్రిన్సిపల్ తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆముదాలవలస TDP MLA కూన రవికుమార్ అన్నారు. ‘KGBVలో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే ప్రిన్సిపల్ <