News December 19, 2024

శుభ ముహూర్తం (19-12-2024)

image

✒ తిథి: బహుళ చవితి మ.12:04 వరకు
✒ నక్షత్రం: ఆశ్లేష తె.4.23 వరకు
✒ శుభ సమయం: ఉ.11 నుంచి మ.12 గంటల వరకు
✒ రాహుకాలం: మ.1.30 నుంచి మ.3.00 వరకు
✒ యమగండం: ఉ.6.00 నుంచి ఉ.7.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి ఉ.10.48 వరకు
తిరిగి మ.2.48 నుంచి మ.3.36 వరకు
✒ వర్జ్యం: సా.4.46 నుంచి సా.6.25 గంటల వరకు
✒ అమృత ఘడియలు: తె.4.12 నుంచి ఉ.5.51 వరకు

Similar News

News October 25, 2025

ఆ యాప్‌లను అధిగమించలేము: పర్‌ప్లెక్సిటీ సీఈవో

image

యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్‌ను అధిగమించడం అసాధ్యమని ఏఐ సెర్చింజన్ పర్‌ప్లెక్సిటీ CEO అరవింద్ శ్రీనివాస్ అన్నారు. గూగుల్ రూపొందించిన ఇతర యాప్‌‌లను మాత్రం స్టార్టప్ సంస్థలు అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు. గూగుల్ ఎకో సిస్టమ్‌ను ఏ స్టార్టప్ దాటలేదని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఆయన‌పై విధంగా బదులిచ్చారు. గూగుల్ సృష్టించిన జెమినీని అధిగమించడం కష్టమేనని పలువురు పేర్కొన్నారు. అరవింద్ కామెంట్స్‌పై మీరేమంటారు?

News October 25, 2025

అక్టోబర్ 25: చరిత్రలో ఈరోజు

image

1921: సంగీత దర్శకుడు టి.వి.రాజు జననం
1962: గేయ రచయిత కలేకూరి ప్రసాద్ జననం
1968: సినీ నటుడు సంపత్ రాజ్ జననం
1999: సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు మరణం(ఫొటోలో)
1951: దేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం
* అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం

News October 25, 2025

కెప్టెన్‌ను బోర్డు కన్సల్టెంట్‌గా నియమించిన పాక్

image

పాక్ క్రికెట్ బోర్డు తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. తమ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ & ప్లేయర్స్ అఫైర్స్ కన్సల్టెంట్‌గా నియమించింది. ఇది చాలా అరుదైన, ఆశ్చర్యకర నిర్ణయమని క్రీడావర్గాలు చెబుతున్నాయి. కెప్టెన్‌గా ఉన్న వ్యక్తికి బోర్డు అడ్మినిస్ట్రేటివ్ సెటప్‌లో స్థానం కల్పించడం ఇదే తొలిసారని అంటున్నారు. ఇలాంటి నిర్ణయాలు పాక్‌కే సాధ్యమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.