News March 21, 2025

శుభ ముహూర్తం (21-03-2025)

image

☛ తిథి: బహుళ సప్తమి రా.11.50 వరకు తదుపరి అష్టమి ☛ నక్షత్రం: జ్యేష్ట రా.9.49 వరకు తదుపరి మూల☛ శుభ సమయం: ఉ.9.48 నుంచి 10.18 వరకు, తిరిగి సా.4.48నుంచి 5.00వరకు ☛ రాహుకాలం: ఉ.10.30నుంచి 12.00 వరకు ☛ యమగండం: మ.3.00 నుంచి 4.30 వరకు ☛ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు తిరిగి మ.12.24నుంచి 1.12వరకు ☛ వర్జ్యం: లేదు ☛ అమృత ఘడియలు: మ.12.20 నుంచి 2.02వరకు

Similar News

News March 21, 2025

అలా జరిగితే ‘మ్యాడ్ స్క్వేర్’ రికార్డు!

image

నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ ఈనెల 28న విడుదల కానుంది. వారం రోజుల్లో విడుదలవనుండగా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయకూడదని మేకర్స్ భావిస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇలా జరిగితే ట్రైలర్ లేకుండా రిలీజైన తొలి సినిమాగా రికార్డులకెక్కనుంది. కాగా, ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీగా అంచనాలున్నాయి.

News March 21, 2025

CUET UG దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

image

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) <>దరఖాస్తు<<>> గడువు రేపటితో ముగియనుంది. మార్చి 23లోగా ఫీజు చెల్లించవచ్చు. ఈనెల 24-26 వరకు దరఖాస్తు సవరణలకు అవకాశం ఉంటుంది. మే 8-జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ వర్సిటీల్లో UG కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను CBT విధానంలో 13 భాషల్లో నిర్వహించనున్నారు.

News March 21, 2025

పచ్చళ్లు అతిగా తింటే క్యాన్సర్ రావొచ్చు!

image

అతిగా పచ్చళ్లు తినడం ప్రమాదకరమని ప్రముఖ వైద్యుడు శ్రీకాంత్ పేర్కొన్నారు. ‘పచ్చళ్ళలో పెరిగే శిలీంధ్రాలు (బూజు/ఫంగస్) నైట్రేట్లని నైట్రైట్లుగా మారుస్తాయి. ఇవి క్యాన్సర్ కారకాలు. అప్పుడప్పుడూ తిన్నవారిని ఇవేం చేయలేవు. కానీ, అదేపనిగా తింటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ ఇది ప్రమాదకరమే. నిలువ పచ్చళ్ల కంటే అప్పుడే చేసిన రోటి పచ్చళ్లు సేఫ్’ అని తెలిపారు.

error: Content is protected !!