News March 23, 2025

శుభ ముహూర్తం (23-03-2025)

image

☛ తిథి: బహుళ నవమి రా.12.49 వరకు తదుపరి దశమి
☛ నక్షత్రం: పూర్వాషాడ రా.12.07 వరకు తదుపరి ఉత్తరాషాడ
☛ శుభ సమయం: లేదు
☛ రాహుకాలం: సా.4.30 నుంచి సా.6.00 వరకు
☛ యమగండం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
☛ దుర్ముహూర్తం: సా.4.25 నుంచి సా.5.13 వరకు
☛ వర్జ్యం: ఉ.9.25 నుంచి ఉ.11.03 వరకు
☛ అమృత ఘడియలు: రా.7.13 నుంచి రా.9.51 వరకు

Similar News

News January 13, 2026

పందెం కోళ్లు.. పేర్లు తెలుసా?

image

AP: సంక్రాంతి వేళ రాష్ట్రంలోని పలు చోట్ల బరులు, కాళ్ల బలం చూపించేందుకు కోళ్లు సిద్ధమయ్యాయి. నెలలుగా ప్రత్యేక శిక్షణ, ఆహారం ఇచ్చి రెడీ చేసిన తమ కోళ్లను బరిలో దించి గెలిచేందుకు యజమానులు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా సేతు, కాకి, డేగ, నెమలి, పర్ల, రసంగి, కిక్కిరాయి, మైల, పింగళి, అబ్రాస్ రకాలను బరిలో దించుతుంటారు. కోళ్ల ఈకల రంగు, మెడ, కాళ్ల సైజు, శరీర తత్వాన్ని బట్టి వాటికి పేర్లు పెడతారు.

News January 13, 2026

కోలీవుడ్‌లో కొత్త వివాదం.. పరాశక్తి బ్యాన్‌కు కాంగ్రెస్ డిమాండ్

image

కోలీవుడ్‌లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమాను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీలో తమ పార్టీని, నేతల్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆయా సీన్‌లను తొలగించాలని డిమాండ్ చేసింది. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జనవరి 10న రిలీజైంది.

News January 13, 2026

వివేకా హత్య కేసులో YS సునీత మరో అప్లికేషన్

image

వివేకా హత్యకేసులో ఆయన కుమార్తె YS సునీత SCలో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు పాక్షికంగానే ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆమె సవాలు చేశారు. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా HYD CBI కోర్టు పాక్షిక విచారణకు ఆదేశించినట్లు అప్లికేషన్‌లో పేర్కొన్నారు. విచారణను SC వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. కాగా CBI విచారణ కొనసాగింపుపై 3నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని SC గతంలోనే ట్రయల్ కోర్టును ఆదేశించింది.