News August 23, 2025
శుభ సమయం (23-08-2025) శనివారం

✒ తిథి: అమావాస్య ఉ.11.17 వరకు
✒ నక్షత్రం: మఖ తె.1.30 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.9.00-మ.10.30
✒ యమగండం: మ.1.30-మ.3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36 వరకు,
✒ వర్జ్యం: మ.1.17-2.55 వరకు
✒ అమృత ఘడియలు: రా.1.30-03.08 వరకు
Similar News
News January 28, 2026
ICET షెడ్యూల్ విడుదల

TG: MBA, MCA కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ICET-2026 షెడ్యూల్ విడుదలైంది.
*ఫిబ్రవరి 6న నోటిఫికేషన్
*ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
*మార్చి 16- దరఖాస్తులకు చివరి తేదీ
*మే 13, 14న కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్
**అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.550, ఇతర అన్ని విభాగాల వారికి రూ.750. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులూ అప్లై చేసుకోవచ్చు.
News January 28, 2026
నేను పార్టీ మారినట్లు BRS భావిస్తోంది: దానం

TG: తాను BRSకు రాజీనామా చేయలేదని, అలాగే తనను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. ‘2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లా. వ్యక్తిగత హోదాలోనే ఆ మీటింగ్‌కు హాజరయ్యా. నేను పార్టీ మారినట్లు BRS భావిస్తోంది’ అని తెలిపారు. మరోవైపు తనపై వేసిన అనర్హత పిటిషన్‌పై ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌ను ఆయన కోరారు.
News January 28, 2026
‘నాన్నా.. నేను విమానంలో అజిత్ పవార్‌తో వెళ్తున్నా’

విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తోపాటు ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి కూడా చనిపోయారు. ముంబైకి చెందిన పింకీ చివరిసారిగా తన తండ్రి శివకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ‘నాన్నా నేను అజిత్ పవార్‌తో కలిసి విమానంలో బారామతి వెళ్తున్నా. అక్కడి నుంచి నాందేడ్ వెళ్లి మీతో రేపు మాట్లాడుతా’ అని చెప్పినట్లు శివ తెలిపారు. తన కూతురిని కోల్పోయానని, ఆమె మృతదేహాన్ని తెస్తే అంత్యక్రియలు నిర్వహిస్తానని కన్నీళ్లుపెట్టుకున్నారు.


