News September 23, 2025
శుభ సమయం (23-09-2025) మంగళవారం

✒ తిథి: శుక్ల విదియ రా.2.34 వరకు
✒ నక్షత్రం: హస్త మ.12.58 వరకు
✒ శుభ సమయములు: 1)ఉ.6.00-8.00 వరకు 2)సా.5.07-6.07 వరకు
✒ రాహుకాలం: మ.3.00-4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00-10.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1)ఉ.8.24-9.12 వరకు, 2)రా.10.48-11.36 వరకు ✒ వర్జ్యం: రా.9.41-11.25 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.6.31-8.13 వరకు
Similar News
News September 23, 2025
జుబీన్ మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం

అస్సాం ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్(52) మృతదేహానికి మరో సారి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సీఎం హిమంత బిస్వశర్మ తెలిపారు. కొన్ని వర్గాలు ఆయన <<17783688>>మరణంపై<<>> అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సింగపూర్ వైద్యులు ఇచ్చిన డెత్ సర్టిఫికెట్‌పై అనుమానాలు ఉన్నాయని, సీఐడీకి కేసు అప్పగిస్తామని ఇప్పటికే సీఎం చెప్పారు. కాగా ఇవాళ అధికార లాంఛనాలతో జుబీన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
News September 23, 2025
24 ఏళ్లలో మోదీ ఒక్క సెలవు తీసుకోలేదు: అమిత్ షా

గత 24 ఏళ్లలో మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నిర్విరామమైన పని PM నిర్ణయాలపై, పనివేగంపై ప్రభావం చూపలేదన్నారు. కఠినమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పార్టీలో ఎలాంటి బాస్ కల్చర్ లేదన్నారు. మోదీ నాయకత్వంలో 2047 నాటికి స్వావలంబన భారత్ విజన్‌ను నిర్దేశించుకున్నామన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ఆయన చెప్పారు.
News September 23, 2025
సెప్టెంబర్ 23: చరిత్రలో ఈరోజు

1976: దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ జననం
1985: క్రికెటర్ అంబటి రాయుడు జననం
1993: నటి షాలిని పాండే జననం
1996: నటి సిల్క్ స్మిత మరణం(ఫొటో)
2019: నటుడు కోసూరి వేణుగోపాల్ మరణం
✤అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం