News March 24, 2025

శుభ ముహూర్తం (24-03-2025)

image

☛ తిథి: బహుళ దశమి రా.12.34 వరకు తదుపరి ఏకాదశి
☛ నక్షత్రం: ఉత్తరాషాఢ రా.12.31 వరకు తదుపరి శ్రవణం
☛ శుభ సమయం: ఉ.6.15-ఉ.6.51, రా.7.27-రా.7.51
☛ రాహుకాలం: ఉ.7.30 నుంచి ఉ.9.00 వరకు
☛ యమగండం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
☛ దుర్ముహూర్తం: మ.12.24-మ1.12, మ.2.46-మ.3.34
☛ వర్జ్యం: ఉ.8.15 నుంచి ఉ.9.53 వరకు
☛ అమృత ఘడియలు: సా.6.00 నుంచి రా.7.38 వరకు

Similar News

News March 25, 2025

IPL-2025: పాపం.. మ్యాక్స్‌వెల్

image

GTతో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ మ్యాక్స్‌వెల్ తొలి బంతికే ఔటై పెవిలియన్‌కు చేరారు. సాయికిశోర్ వేసిన బంతి నేరుగా వికెట్లను తగులుతున్నట్లు కనిపించడంతో అంపైర్ LBW ఇవ్వగా మ్యాక్సీ రివ్యూ తీసుకోలేదు. ఆ తర్వాత రీప్లే చూస్తే బాల్ స్టంప్స్‌ను మిస్ అయినట్లు కనిపించింది. దీంతో మ్యాక్స్‌వెల్ రివ్యూ తీసుకొని ఉండాల్సిందని.. మరో ఎండ్‌లో ఉన్న శ్రేయస్ అయినా చెబితే బాగుండేదని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

News March 25, 2025

29న పార్లమెంట్ సమావేశాలు రద్దు

image

ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. గత వారం హోలీకి ముందు రోజు సెలవు ఇవ్వడంతో ఈ నెల 29న కార్యకలాపాలు నిర్వహించాలని తొలుత నిర్ణయించింది. అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఇవాళ పేర్కొంది. ఆ రోజు యథాతథంగా సెలవు ఉంటుందని తెలిపింది.

News March 25, 2025

OTTలోకి సందీప్ కిషన్ ‘మజాకా’

image

సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన ‘మజాకా’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఉగాది కానుకగా ఈ నెల 28 నుంచి జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ఓ పోస్టర్ ద్వారా తెలిపింది. నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ మూవీలో ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా గత నెల 26న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

error: Content is protected !!