News February 25, 2025

శుభ ముహూర్తం (25-02-2025)

image

☛ తిథి: బహుళ ద్వాదశి, ఉ.10.32 వరకు
☛ నక్షత్రం: ఉత్తరాషాడ, సా.5.07 వరకు
☛ శుభ సమయం: సా.7.07-7.31 వరకు
☛ రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
☛ యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, రా.10.48-11.36 వరకు
☛ వర్జ్యం: రా.9.01 నుంచి 10.35 వరకు
☛ అమృత ఘడియలు: ఉ.10.37-12.13 వరకు, రా.8.22-9.54 వరకు

Similar News

News November 13, 2025

లబ్ధిదారుల ఎంపికపై అవగాహన చేపట్టాలి: ASF కలెక్టర్

image

ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద ఎల్పీజీ గ్యాస్ లబ్ధిదారుల ఎంపికపై విస్తృత అవగాహన చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. గురువారం ASF జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి ప్రధానమంత్రి ఉజ్వల పథకంపై పౌరసరఫరాల శాఖ అధికారులు, తహశీల్దార్లు, వ్యవసాయ, మత్స్య శాఖల అధికారులు, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

News November 13, 2025

TG TET షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) షెడ్యూల్ విడుదలైంది. రేపు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి.

News November 13, 2025

పచ్చిరొట్టగా పెసర/మినుముతో సాగుకు లాభం

image

ఒక ఎకరం పొలంలో 6-8 కిలోల పెసర/మినుము విత్తనాలు చల్లాలి. పూత దశకు వచ్చాక మొదళ్లు, కొమ్మలు, ఆకులను భూమిలో కలియదున్నాలి. దీని వల్ల 8 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. అలాగే 24KGల నత్రజని, 5KGల భాస్వరం, 6KGల పొటాష్, ఇతర పోషకాలు భూమికి అందుతాయి. ఈ పచ్చిరొట్ట ఎరువు భూమిలో మొక్కల వేర్ల ద్వారా నత్రజనిని ఎక్కువగా స్థిరీకరిస్తుంది. దీని వల్ల పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి పొందవచ్చు.