News September 25, 2025
శుభ సమయం (25-09-2025) గురువారం

✒ తిథి: శుక్ల చవితి పూర్తిగా
✒ నక్షత్రం: స్వాతి సా.5.34 వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: మ.1.30-3.00 వరకు
✒ యమగండం: ఉ.6.00-7.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1)ఉ.10.00-10.48 వరకు 2)మ.2.48-3.06 వరకు
✒ వర్జ్యం: రా.11.47-1.33 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.7.53-9.39 వరకు
Similar News
News February 10, 2026
NCL 270 పోస్టులకు నోటిఫికేషన్

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(NCL) 270 అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ట్రైనీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు రేపటి నుంచి మార్చి 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.47,330 చెల్లిస్తారు. రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nclcil.in
News February 10, 2026
విజయవాడ ‘మెట్రో’ సంగతేంటి?

AP: విశాఖ మెట్రోకు కేంద్రం <<19100784>>గ్రీన్‌సిగ్నల్<<>> ఇచ్చిందనే వార్తల నేపథ్యంలో విజయవాడ మెట్రో సంగతి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ 2 నగరాల్లో మెట్రోలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అమరావతికి అతిచేరువలోని విజయవాడకు మెట్రో వస్తే రాజధాని రూపురేఖలు మారుతాయనే అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలో విశాఖకే అనుమతిచ్చి VJAను పక్కనపెట్టడానికి కారణాలు ఏమై ఉంటాయనే చర్చ జరుగుతోంది.
News February 10, 2026
శ్రీశైలం మల్లన్న దర్శనానికి 4 గంటలు

AP: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం 12pm వరకు 32,870 మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 14,280మంది కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. 12,931మంది శివస్వాములు స్పర్శ దర్శనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పెరిగిన రద్దీ కారణంగా మల్లన్న దర్శనానికి 4గంటల టైమ్ పడుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.


