News February 26, 2025
శుభ ముహూర్తం (26-02-2025)

☛ తిథి: బహుళ త్రయోదశి, ఉ.9.46 వరకు
☛ నక్షత్రం: శ్రవణం, సా.4.39 వరకు
☛ రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
☛ యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24 వరకు
☛ వర్జ్యం: రా.8.36 నుంచి 10.10 వరకు
☛ అమృత ఘడియలు: తె.6.08 గంటల నుంచి
Similar News
News February 26, 2025
నేనైనా లింగ వివక్షను ఎదుర్కోవాల్సిందే: జ్యోతిక

హీరో సూర్య భార్యగా తానూ లింగ వివక్షను ఎదుర్కొంటున్నట్లు నటి జ్యోతిక చెప్పారు. ‘సూర్యని పెళ్లి చేసుకున్నందుకు నేను అదృష్టవంతురాలినని ఏదైనా ఇంటర్వ్యూలో చెబితే ప్రజలు అతడు మంచివాడని అంటారు. నన్ను పెళ్లి చేసుకొని సూర్య సంతోషంగా ఉన్నాడని చెప్పినా అతడినే పొగుడుతారు. ఇందులో నేనెక్కడా కనిపించను. ఎందుకంటే సమాజం అలా చిత్రీకరిస్తుంది’ అని తాను నటించిన ‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ ప్రమోషన్లో తెలిపారు.
News February 26, 2025
మహా శివరాత్రితో మహా కుంభమేళాకు తెర

ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక మహాకుంభ మేళా నేటితో ముగియనుంది. మహా శివరాత్రి పర్వదినంతో ఈ మహత్తర కార్యక్రమానికి తెరపడనుంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటివరకు 65 కోట్ల మంది స్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చివరి రోజైన ఇవాళ 2 కోట్ల మంది రానున్నట్లు అంచనా.
News February 26, 2025
బ్రహ్మ, విష్ణువు మధ్య వివాదం.. శివుడు ఏం చేశాడంటే?

విష్ణువు, బ్రహ్మ మధ్య ఎవరుగొప్ప అనే వివాదం తలెత్తుతుంది. అప్పుడు శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, లింగానికి ఆది, అంతాలను కనిపెట్టిన వారే గొప్పవారని చెబుతాడు. విష్ణువు మహాలింగం మూలం కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. బ్రహ్మ ఆది తెలుసుకోవాలని చూసి విఫలమవుతాడు. అయితే తాను ఆది కనుగొన్నట్లు మొగలిపువ్వు, గోవుతో శివుడికి అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తాడు. అది తెలిసి బ్రహ్మ, మొగలిపువ్వు, గోవును శివుడు శపిస్తాడు.