News March 26, 2025

శుభ ముహూర్తం (26-03-2025)

image

☛ తిథి: బహుళ ద్వాదశి రా.10.37 వరకు తదుపరి త్రయోదశి
☛ నక్షత్రం: ధనిష్ఠ రా.11.53 వరకు తదుపరి శతభిషం
☛ శుభ సమయం: లేదు
☛ రాహుకాలం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
☛ యమగండం: ఉ.7.30-ఉ.9.00 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
☛ వర్జ్యం: లేదు
☛ అమృత ఘడియలు: మ.1.43 నుంచి మ.3.15 వరకు

Similar News

News March 29, 2025

కొత్త రేషన్‌ కార్డులు, సన్న బియ్యంపై కీలక ప్రకటన

image

TG: అర్హతను బట్టి ఎంతమందికైనా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి కార్డు లేకున్నా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే సన్నబియ్యం ఇస్తామని ప్రకటించారు. ఉగాది రోజున సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 85 శాతం మందికి సన్నబియ్యం అందుతుందని, త్వరలోనే పప్పు, ఉప్పు లాంటి సరకులు కూడా ఇస్తామని పేర్కొన్నారు.

News March 28, 2025

‘కాంతార’లో యాక్టింగ్.. మోహన్ లాల్ రెస్పాన్స్ ఇదే..!

image

కాంతార-2 చిత్రంలో నటించడంపై మోహన్ లాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక రిపోర్టర్ కాంతారలో నటిస్తున్నారా అని అడగగా ‘మీరు ఆ చిత్రంలో పాత్రను ఇప్పించండి, నేను అంత చెడ్డ నటుడని కాదు’ అని బదులిచ్చారు. దీంతో కాంతార-2 మోహన్ లాల్ నటించట్లేదని భావిస్తున్నారు. 2022 విడుదలైన కాంతార భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. దీని ప్రీక్వెల్‌ని ఈ ఏడాది అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

News March 28, 2025

చాట్ జీపీటీని దాటేసిన గ్రోక్

image

ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బోట్ ‘గ్రోక్’ సంచలనం సృష్టిస్తోంది. అమెరికా గూగుల్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ టాప్ ఫ్రీ లిస్టులో అగ్రస్థానానికి చేరింది. ఈ క్రమంలో గ్రోక్.. చాట్ జీపీటీ, టిక్‌టాక్‌ను దాటేసినట్లు మస్క్ ట్వీట్ చేశారు. గ్రోక్ ఆండ్రాయిడ్ యాప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అందుబాటులోకి వచ్చింది.

error: Content is protected !!