News January 27, 2025

శుభ ముహూర్తం (27-01-2025)

image

✒ తిథి: బహుళ త్రయోదశి రా.7.39 వరకు
✒ నక్షత్రం: మూల ఉదయం 8.17 గంటల వరకు
✒ శుభ సమయములు: ఉ.5.44 నుంచి 6.20 గంటల వరకు, సా.6.56 నుంచి 7.20 గంటల వరకు
✒ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30-12.00 వరకు
✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12 వరకు
✒ వర్జ్యం: ఉ.8.15 గంటల వరకు
✒ అమృత ఘడియలు: తె.4.01-5.39 వరకు

Similar News

News October 28, 2025

గోళ్లు అందంగా ఉండాలంటే ఇలా చేయండి

image

చేతులు అందంగా ఉండటంలో గోళ్లు ప్రముఖపాత్ర పోషిస్తాయి. వీటిని సంరక్షించుకోవడానికి మీ కోసం కొన్ని చిట్కాలు. రెగ్యులర్‌గా గోళ్లను కట్ చేసుకోవాలి. గోళ్లు ఎక్కువగా నీటిలో నానకుండా పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మీ నెయిల్స్, క్యూటికల్స్‌ను మాయిశ్చరైజ్ చెయ్యాలి. నెయిల్ పెయింట్​ ఎక్కువ కాలం ఉంచకుండా చూసుకోవాలి. ఫంక్షన్ల వంటివి పూర్తయిన తర్వాత.. పాలిష్ రిమూవ్ చేసుకోవడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

News October 28, 2025

NOV 1 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్

image

ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న పొల్యూషన్‌ కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. NOV 1 నుంచి నగరంలో BS-4, BS-5 డీజిల్ వాహనాలను బ్యాన్ చేయాలని నిర్ణయించింది. BS-6 డీజిల్ వాహనాలను మాత్రమే అనుమతించనుంది. దీన్ని సక్రమంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ రూల్‌ను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు వేయాలంది. అన్ని మేజర్ ఎంట్రీ పాయింట్ల వద్ద వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

News October 28, 2025

రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించరు: కవిత

image

TG: మహబూబ్‌నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని, ఆయనను ప్రజలు క్షమించరని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ‘జనంబాట’లో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన కరివెన రిజర్వాయర్‌ను ఆమె పరిశీలించారు. కేసీఆర్ హయాంలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు 80% పూర్తయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఫైరయ్యారు.