News December 28, 2024

శుభ ముహూర్తం (28-12-2024)

image

✒ తిథి: బహుళ త్రయోదశి రా.2:23 వరకు
✒ నక్షత్రం: అనురాధ రా.9.59 వరకు
✒ శుభ సమయం: ఉ.11.00 నుంచి మ.1.00 వరకు
✒ రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
✒ యమగండం: మ.1.30 నుంచి 3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి 7.36 వరకు
✒ వర్జ్యం: తె.3.57 నుంచి 5.38 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.10.46 నుంచి మ.12.28 వరకు

Similar News

News November 23, 2025

మెదక్: రిజర్వేషన్ కోసం ఎదురు చూపులు?

image

మెదక్ జిల్లా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 492 పంచాయతీలుండగా 4,220 వార్డులు, మొత్తం ఓటర్లు 5,23,327 ఉన్నారు. ఇందులో మహిళలు 2,71,787, పురుషులు 2,51,532 ఇతరులు 8 మంది ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో కసరత్తు నడుస్తోంది. తమకు అనుకూలంగా వస్తుందా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News November 23, 2025

బోస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>జేసీ<<>> బోస్ ఇన్‌స్టిట్యూట్‌ 13 డఫ్ట్రీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎనిమిదో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://jcbose.ac.in/

News November 23, 2025

శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

image

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>