News December 29, 2024
శుభ ముహూర్తం (29-12-2024)

✒ తిథి: బహుళ చతుర్దశి తె.3:39 వరకు
✒ నక్షత్రం: జ్యేష్ట రా.11.31 వరకు
✒ శుభ సమయం: ఉ.7.00 నుంచి 9.00 వరకు
✒ రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
✒ యమగండం: మ.12.00 నుంచి 1.30 వరకు
✒ దుర్ముహూర్తం: మ.4.25 నుంచి 5.13 వరకు
✒ వర్జ్యం: లేదు
✒ అమృత ఘడియలు: మ.2.27 నుంచి మ.4.09 వరకు
Similar News
News September 24, 2025
OG అంటే ఒంటరిగా గెలవనోడని అర్థమా?: వైసీపీ ఎమ్మెల్యే

AP: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘OG’పై వైసీపీ ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘OG అంటే ఒంటరిగా గెలవనోడని అర్థమా?’ అని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై జనసైనికులు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో తాము 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించామని, వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా OG అంటే ఓజస్ గంభీర అని మేకర్స్ గతంలో ప్రకటించారు.
News September 24, 2025
రూ.12వేల కోట్లు టార్గెట్.. మెగా IPOకు ఫోన్ పే!

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే మెగా IPOకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రూ.12వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా సెబీ వద్ద DRHP దాఖలు చేసినట్టు సమాచారం. గ్రీన్‌సిగ్నల్ రాగానే దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కానుంది. దేశంలో అత్యధిక మంది వాడే డిజిటల్ పేమెంట్స్ యాప్‌లో ఫోన్ పే ముందు వరుసలో ఉంది. దీనికి సుమారు 60 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. నిత్యం 31 కోట్ల ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి.
News September 24, 2025
రిజర్వేషన్లు ఖరారు.. ఎన్నికల సందడి షురూ!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. వార్డు సభ్యుడి నుంచి ZP స్థానాల వరకు జిల్లాల కలెక్టర్లు రిజర్వేషన్లు రూపొందించారు. ఆయా నివేదికలను ఇవాళ సాయంత్రానికి ప్రభుత్వానికి అందజేస్తారు. వాటి ఆధారంగా సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. అయితే మహిళలకు 50% రిజర్వేషన్లను త్వరలో డ్రా పద్ధతిలో నిర్ణయించనున్నారు.