News September 5, 2025
శుభ సమయం (5-09-2025) శుక్రవారం

✒ తిథి: శుక్ల త్రయోదశి రా.1.37 వరకు
✒ నక్షత్రం: శ్రవణం రా.11.15 వరకు
✒ శుభ సమయములు: ఉ.10.10-10.40, తిరిగి సా.5.10-5.22 వరకు
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00 వరకు
✒ యమగండం: మ.3.00-సా.4.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, తిరిగి మ.12.24-1.12
✒ వర్జ్యం: తె.3.16-4.52 వరకు
✒ అమృత ఘడియలు: మ.12.36-2.14 వరకు
Similar News
News September 7, 2025
వాలంటీర్ల పనులు మాతో ఎందుకు.. సచివాలయ ఉద్యోగుల నిరసన

AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పోరాటానికి దిగారు. వాలంటీర్ల విధులను చేయాలని ప్రభుత్వం ఆదేశించడాన్ని నిరసిస్తున్నామని జేఏసీ తెలిపింది. నిన్న నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాగా వైసీపీ హయాంలో 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ఉండగా.. కూటమి సర్కార్ ఆ వ్యవస్థను పక్కనబెట్టింది. ఇప్పుడు నాలుగైదు క్లస్టర్లకు ఓ సచివాలయ ఉద్యోగికి కేటాయించి పనులు చేయాలని సూచించింది. తమపై ఒత్తిడి పెరుగుతోందని వాపోతున్నారు.
News September 7, 2025
మహిళలూ.. జింక్ తగ్గిందా..?

మహిళల ఆరోగ్యానికి జింక్ ఎంతో అవసరం. జింక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ ఉత్పత్తిని పెంచుతుంది. గర్భాశయానికి రక్తప్రసరణ పెంచి, నెలసరిలో వచ్చే నొప్పుల్ని తగ్గిస్తుంది. గాయాలు, వాపులు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. తెల్లరక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. చర్మ కణాల పునరుద్ధరణకు సాయపడుతుంది. పునరుత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుతుంది. జింక్ కోసం చిక్కుళ్లు, శనగలు, గుమ్మడి, పుచ్చగింజలు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి.
News September 7, 2025
సముద్రం పాలవుతున్న కృష్ణా-గోదావరి వరద

గోదావరి, కృష్ణా బేసిన్లలో భారీ రిజర్వాయర్లు లేక వరద జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి నిన్నటివరకు గోదావరి నుంచి 2,350, కృష్ణా నుంచి 726 TMCలు సముద్రంలో కలిశాయి. కృష్ణా బేసిన్‌లో నాగార్జునసాగర్ 312.04 TMC, శ్రీశైలం 215.80, గోదావరి బేసిన్‌లో MH పైఠన్‌లో జయక్వాడీ 102, TGలో శ్రీరామ్‌సాగరే(80TMC) పెద్ద రిజర్వాయర్లు. పోలవరం(194 TMC) నిర్మాణం పూర్తైతే అదే అతిపెద్ద జలాశయం అవుతుంది.