News September 8, 2025
శుభ సమయం (8-09-2025) సోమవారం

✒ తిథి: బహుళ పాడ్యమి రా.10.21 వరకు
✒ నక్షత్రం: పూర్వాభాద్ర రా.10.11 వరకు
✒ శుభ సమయములు: రా.7.40-రా.8.10
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-మ.1.12, మ.2.46-మ.3.34
✒ వర్జ్యం: లేదు
✒ అమృత ఘడియలు: మ.12.58-సా.4.30
Similar News
News September 9, 2025
క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభించిన మంత్రి

TG: క్యాన్సర్ డే కేర్ సెంటర్ల ఏర్పాటు ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలోని 34 ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ఆయన వర్చువల్‌గా సంగారెడ్డిలో ప్రారంభించారు. క్యాన్సర్‌ను సమయానికి గుర్తించకపోతే ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందన్నారు. రాబోయే కాలంలో 70% క్యాన్సర్ కేసులు పెరగొచ్చని, అందుకే ముందుగా స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.
News September 9, 2025
రేపే భారత్ మ్యాచ్.. టీమ్ ఇదేనా?

ఆసియా కప్-2025లో భాగంగా భారత్ రేపు తన తొలి మ్యాచ్ ఆడనుంది. యూఏఈతో జరిగే ఆ మ్యాచ్ బుధవారం రాత్రి 8 గం.కు ప్రారంభం కానుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం జట్టు అంచనా..
టీమ్: గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (C), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, జితేశ్ శర్మ (WK), బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
News September 9, 2025
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ భేటీ

TG: రీజినల్ రింగ్ రోడ్డు పనుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ కోరారు. దీనికి సంబంధించి 90% భూసేకరణ పూర్తయిందని ఆయనకు వివరించారు. రావిర్యాల-అమన్‌గల్-మన్ననూర్ రోడ్డును 4 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిగా నిర్మించాలని కోరారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుమతివ్వాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.