News February 21, 2025

శుభ ముహూర్తం (శుక్రవారం, 21-02-2025)

image

తిథి: ఉ.8.20 వరకు అష్టమి, తదుపరి నవమి
నక్షత్రం: జ్యేష్ట (మ.12.46 నుంచి)
రాహుకాలం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
యమగండం: మ.3.00 నుంచి మ.4.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.24- ఉ.9.12, మ.12.24-మ.1.12
వర్జ్యం: సా.6.46 నుంచి రా.8.28 వరకు
అమృత ఘడియలు: తె.5.04 ల

Similar News

News February 22, 2025

ఐకానిక్ టవర్‌ నిర్మాణం కోసం కమిటీ

image

AP: అమరావతిలో NRT సొసైటీ ఐకాన్ టవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో 9 మంది అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అమరావతికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చేందుకు ఈ ప్రాజెక్టును సర్కార్ నిర్మిస్తోంది.

News February 22, 2025

ఒక్క గంట నడిస్తే 6 గంటల ఆయుష్షు పెరుగుద్ది!

image

నడక ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తున్నా కొందరు అడుగు తీసి అడుగేయరు. తాజా అధ్యయనంలో రోజులో ఒక గంట నడిస్తే 6 గంటల ఆయుష్షు పెరుగుతుందని తేలింది. సాధారణ వ్యక్తులు తమ పనికి మరో గంట నడకను జోడిస్తే 6.3 గంటల ఆయుష్షును పెంచుకున్నట్లేనని వెల్లడైంది. నడక కండరాల బలాన్ని & ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువు, డయాబెటిస్, గుండెపోటు తగ్గించేందుకు నడక అవసరమంటున్నారు. SHARE IT

News February 21, 2025

కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

image

తెలంగాణలో డీజీగా ఉన్న అంజనీకుమార్‌ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయనతో పాటు TG పోలీస్ అకాడమీ డైరెక్ట‌ర్‌ అభిలాష బిస్త్, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఏపీ క్యాడర్‌లో రిపోర్టు చేయాలని ఈ ముగ్గురికి ఆదేశాలు జారీ చేసింది.

error: Content is protected !!