News February 20, 2025
శుభ ముహూర్తం (గురువారం, 20-02-2025)

తిథి: ఉ.6.39 నుంచి అష్టమి
నక్షత్రం: ఉ.10.39 నుంచి అనురాధ
రాహుకాలం: మ.1.30 నుంచి మ.3.00 వరకు
యమగండం: ఉ.6.30 నుంచి ఉ.7.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.00- ఉ.10.48, మ.2.48-మ.3.36
వర్జ్యం: మ.3.00 నుంచి మ.4.44 వరకు
అమృత ఘడియలు: రా.1.26 నుంచి తె.3.10 వరకు
Similar News
News February 21, 2025
SUPER MAN ‘షమీ’.. సంచలనం

IND బౌలర్ షమీ సూపర్‌మ్యాన్ తరహాలో <<15524646>>చెలరేగిపోతున్నారు.<<>> ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న బంగ్లాదేశ్‌పై 5 వికెట్లు తీసిన ఆయన మరో సంచలనం సృష్టించారు. ఐసీసీ ODI ఈవెంట్లలో అత్యధిక వికెట్లు(60) తీసిన భారత బౌలర్‌గా నిలిచారు. కేవలం 19 ఇన్నింగ్సుల్లోనే ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. ఆ తర్వాత జహీర్(32innsలో 59 వికెట్లు), శ్రీనాథ్(35inns-47W). జడేజా(32inns-43W), బుమ్రా(25inns-42W), కుంబ్లే(28inns-42W) ఉన్నారు.
News February 21, 2025
దోబూచులాడుతున్న బంగారం ధరలు!

బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర తగ్గగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ కాస్త పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 తగ్గి రూ.80,250లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60 పెరగడంతో రూ.88,100లకు చేరింది. అటు వెండి ధర మాత్రం రూ.100 తగ్గి కేజీ రూ.1,07,900 వద్ద కొనసాగుతోంది.
News February 21, 2025
CONFIRM: గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్

తన బయోపిక్‌లో బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావ్ నటిస్తారని మాజీ క్రికెటర్ గంగూలీ వెల్లడించారు. అయితే డేట్స్ పరంగా కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కావడానికి ఏడాది టైమ్ పడుతుందని చెప్పారు. గంగూలీ 113 టెస్టులు, 311 వన్డేల్లో 18వేలకు పైగా పరుగులు చేశారు. 2008లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐకి అధ్యక్షుడిగానూ సేవలందించారు.