News March 28, 2024

వార్నర్, స్టొయినిస్‌కు ఆసీస్ బిగ్ షాక్

image

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్స్ మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, అస్టన్ అగర్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. 2024-25 సీజన్‌కు గానూ వీరి సెంట్రల్ కాంట్రాక్టును సీఏ రద్దు చేసింది. జేవియర్ బార్ట్‌లెట్, అరోన్ హార్డీ, మాథ్యూ షార్ట్, నాథన్ ఎల్లిస్‌కు తొలిసారి కాంట్రాక్ట్ కట్టబెట్టింది. వీరందరూ గతేడాది జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.

Similar News

News April 10, 2026

‘హార్ముజ్’ వద్ద టోల్ వసూలు చేయవద్దు: ట్రంప్

image

‘హార్ముజ్’ వద్ద ఇరాన్ టోల్ వసూలు చేస్తోందన్న వార్తలపై ట్రంప్ స్పందించారు. ఒకవేళ ఫీజు వసూలు చేస్తుంటే వెంటనే ఆపేయాలని సూచించారు. ఇక ఇరాన్‌పై తాను ముందస్తు విజయం ప్రకటించుకున్నట్లు WSJ ప్రచురించడంపై ట్రంప్ మండిపడ్డారు. తాము విక్టరీ సాధించామని, ముందస్తు అనేదే లేదన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండకుండా చేస్తానని చెప్పారు. ఆ దేశ సాయం లేకపోయినా త్వరలోనే ఆయిల్ యథావిధిగా సరఫరా అవుతుందన్నారు.

News April 10, 2026

వరుస ఫ్లాప్స్.. కృతి శెట్టి ఏమన్నారంటే?

image

సూపర్ హిట్ ఫిల్మ్‌ ‘ఉప్పెన’తో హీరోయిన్‌గా లాంచ్ అయిన కృతిశెట్టి తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటంపై స్పందించారు. బేబమ్మ లాంటి బలమైన పాత్ర తనకు మళ్లీ రాలేదని, అది ఒక లోటుగా మిగిలిపోయిందని చెప్పారు. సినిమాలు ఫెయిల్ అవుతున్నాయన్న బాధ కంటే బలమైన పాత్రలు దక్కలేదనే బాధే ఎక్కువగా ఉందని ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా ప్రమోషన్లలో వెల్లడించారు. త్వరలో ఆమె అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో నటించబోతున్నారు.

News April 10, 2026

అభిమానికి కొత్త ఫోన్ ఇచ్చిన సంజూ.. నెట్టింట ప్రశంసలు

image

రోడ్డుపై సెల్ఫీ అడిగిన ఫ్యాన్‌కు టీమ్ ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్ స్మార్ట్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడంపై ప్రశంసలొస్తున్నాయి. కేరళంలోని పాలక్కాడ్ సమీపంలో కాల్ మాట్లాడేందుకు సంజూ కారును ఆపారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న శబరీష్ అనే యువకుడు సంజూను చూసి సెల్ఫీ అడిగాడు. అయితే శబరీష్ ఫోన్ డిస్‌ప్లే పాడయిందని గమనించిన సంజూ వెంటనే ఓ కొత్త ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.