News February 1, 2025
శ్రీలంకను మట్టికరిపించిన ఆసీస్
తొలి టెస్టులో SLను ఆస్ట్రేలియా మట్టికరిపించింది. గాలే వేదికగా జరిగిన టెస్టులో వార్ వన్ సైడ్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 654-6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి INGలో 165కే ఆలౌట్ అయిన శ్రీలంక ఫాలో ఆన్ ఆడింది. 4వ రోజు అందులోనూ 247 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆసీస్ ఓ ఇన్నింగ్స్ & 242 రన్స్ తేడాతో గెలుపొందింది. టెస్టుల్లో AUSకు ఇది నాలుగో అతిపెద్ద విజయం. డబుల్ సెంచరీ చేసిన ఖవాజాకు POTM అవార్డు దక్కింది.
Similar News
News February 1, 2025
ఇది దేశ గతినే మార్చే బడ్జెట్: బండి సంజయ్
TG: కేంద్ర బడ్జెట్ దేశ గతినే మార్చుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్ ఇది. బడ్జెట్‌పై విపక్షాల అనవసర విమర్శలు మానుకోవాలి. కేంద్రానికి తెలంగాణ సర్కార్ సహకరించాలి’ అని అన్నారు. అలాగే, ఇది ప్రజారంజక బడ్జెట్ అని MP DK అరుణ కొనియాడారు. రూ.12లక్షల వరకు IT కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇది అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే బడ్జెట్ అని చెప్పారు.
News February 1, 2025
ముగిసిన సీఎం సమీక్ష
TG: మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సుదీర్ఘంగా జరిగిన భేటీలో వివిధ శాఖలు, రంగాలకు బడ్జెట్ అవసరాలపై చర్చలు జరిపారు. నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు.
News February 1, 2025
తక్కువ వడ్డీతో రూ.5లక్షల రుణం.. ఇలా చేయండి
కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని కేంద్రం రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచింది. కౌలు రైతులు, భూ యజమాని-సాగుదారులు, వాటాదారులు, వ్యవసాయం లేదా చేపలు పట్టడం లేదా పశుపోషణ వంటి లేదా డ్వాక్రా సభ్యులు ఈ కార్డు తీసుకునేందుకు అర్హులు. వడ్డీ కేవలం 4శాతం(7శాతంలో 3% కేంద్రం రాయితీ) ఉంటుంది. 5 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. దేశంలోని ఏ బ్యాంకులోనైనా కార్డు తీసుకోవచ్చు. రూ.2లక్షలలోపు రుణానికి పూచీకత్తు అవసరం లేదు.