News June 16, 2024
ఆసీస్ విజయం.. బతికిపోయిన ఇంగ్లండ్

T20 WCలో స్కాంట్లాండ్పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో గ్రూప్-బీలో స్కాట్లాండ్ ఇంటిబాట పట్టగా ఇంగ్లండ్ సూపర్-8కి చేరింది. ఆసీస్పై స్కాట్లాండ్ గెలిచి ఉంటే ఆ జట్టు సూపర్-8కి చేరి, ఇంగ్లండ్ ఇంటికి వెళ్లేది. ఈ మ్యాచ్లో AUSకి 181 రన్స్ టార్గెట్ ఇచ్చిన స్కాట్లాండ్ ఒక దశలో గెలుపు వైపు ప్రయాణించింది. కానీ హెడ్ 68, స్టొయినిస్ 59 రన్స్తో ఆ జట్టుకు విజయాన్ని దూరం చేశారు.
Similar News
News November 24, 2025
ధర్మేంద్ర గురించి తెలుసా?

ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్ లుధియానాలోని నస్రలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న ఆయన జన్మించారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ కింగ్గానూ పేరు గాంచిన ఆయన సినీ రంగానికి చేసిన కృషికి 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2005లో BJP తరఫున రాజస్థాన్లోని బికనీర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.
News November 24, 2025
ఇంటర్వ్యూతో ESICలో ఉద్యోగాలు

<
News November 24, 2025
కెనడా పౌరసత్వ చట్టంలో సవరణ.. విదేశీయులకు గుడ్న్యూస్

విదేశాల్లో పుట్టిన లేదా దత్తత తీసుకున్న చిన్నారుల పౌరసత్వంపై పరిమితులు విధిస్తూ 2009లో తెచ్చిన పౌరసత్వ చట్టంలో కెనడా సవరణ చేసింది. కొత్త చట్టం ద్వారా విదేశాల్లో పుట్టిన కెనడియన్లూ తమ సంతానానికి పౌరసత్వాన్ని బదిలీ చేసే ఛాన్స్ ఉండేలా మార్పులు చేస్తూ బిల్ సీ-3 తెచ్చింది. బిడ్డల్ని కనే ముందు 1075 రోజులు కెనడాలోనే ఉన్నట్లు ప్రూఫ్ చూపాలి. పాత చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కెనడియన్ కోర్టు కొట్టేసింది.


