News August 21, 2024
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సపోర్ట్.. ICC ఛైర్మన్‌గా జైషా!

బీసీసీఐ సెక్రటరీ జైషా ICC ఛైర్మన్‌గా త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు ఆయనకు సపోర్ట్ చేశాయని మూడేళ్ల పాటు ICC సారథిగా ఉంటారని వెల్లడించాయి. దీంతో బీసీసీఐ సెక్రటరీగా రాజీనామా చేసి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కు వెళ్లనున్నారు. మూడేళ్ల తర్వాత 2028లో తిరిగి BCCIకి సెక్రటరీగా వచ్చే అవకాశం ఉంది.
Similar News
News January 23, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.5,400 పెరిగి రూ.1,59,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,950 ఎగబాకి రూ.1,46,400గా ఉంది. కిలో వెండి ధర ఏకంగా రూ.20,000 పెరిగి రూ.3,60,000గా నమోదైంది.
News January 23, 2026
తిరుమల అప్డేట్.. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం 64,571 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,634 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లుగా నమోదైంది.
News January 23, 2026
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో కాస్త తడబడ్డప్పటికీ కాసేపటికే పుంజుకున్నాయి. సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 82,425 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 23 పాయింట్లు లాభపడి 25,313 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో TCS, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL టెక్ షేర్లు లాభాల్లో.. ఇండిగో, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


