News November 20, 2024

ఏటా 7 సెంటీమీటర్లు కదులుతున్న ఆస్ట్రేలియా!

image

ఆస్ట్రేలియా ఏటా 7 సెంటీమీటర్ల మేర ఉత్తర దిశగా కదులుతోంది. ఖండాల కింద ఉండే భూ ఫలకాలను టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఇవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. కదలిక మరీ ఎక్కువగా ఉన్న చోట భూకంపాలు కూడా సంభవిస్తుంటాయి. ఆస్ట్రేలియా కింద ఉన్న ఫలకమంతా ఉత్తరదిశగా కదులుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, అది వేరే ఏ ఖండాన్ని ఢీ కొట్టాలన్నా లక్షల సంవత్సరాలు పడుతుందని అంచనా.

Similar News

News November 21, 2025

హారతిని కళ్లకు అత్తుకుంటున్నారా?

image

చాలామంది హారతిని కళ్లకు అత్తుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడికి దిష్టి తీయడం కోసమే హారతి ఇస్తారని, దాన్ని కళ్లకు అత్తుకోకూడదని సూచిస్తున్నారు. ‘ఇంట్లో, చిన్న పిల్లలకు చెడు దృష్టి తగలకుండా దిష్టి తీసినట్లే స్వామివారికి దృష్టి దోషం పోవడానికే హారతి ఇస్తారు. అందులో ఏ సానుకూల శక్తి ఉండదు. దిష్టి తీసిన గుమ్మడికాయను వదిలేసినట్లే హారతిని కూడా వదిలేయాలి’ అని వివరిస్తున్నారు.

News November 21, 2025

RRB-NTPC ఫలితాలు విడుదల

image

RRB-NPTC 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి https://indianrailways.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 27.55లక్షల మంది పరీక్ష రాయగా.. 51,979మంది సీబీటీ 2కు అర్హత సాధించారు.

News November 21, 2025

ఢిల్లీ హైకోర్టులో గౌతమ్ గంభీర్‌కు ఊరట

image

భారత్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో లైసెన్స్ లేకుండా కొవిడ్-19 మందులు నిల్వ చేసి, పంపిణీ చేశారని గంభీర్, కుటుంబ సభ్యులు, ఛారిటబుల్ ఫౌండేషన్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పు చెప్పారు. ఫిర్యాదును కొట్టివేస్తున్నట్టు వెల్లడించారు. పూర్తి తీర్పు రావాల్సి ఉంది.