News July 1, 2024
ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజు భారీగా పెంపు

విద్యార్థి వీసా ఫీజును ఆస్ట్రేలియా 473 అమెరికన్ డాలర్ల నుంచి 1,068 డాలర్లకు పెంచింది. నేటి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. ఇతర దేశాల నుంచి వలసలను నియంత్రించేందుకు, అంతర్జాతీయ విద్యావిధానాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంలో 5,48,000 మంది ఇతర దేశాల నుంచి అక్కడికి వలస వెళ్లినట్లు ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి.
Similar News
News April 11, 2026
గ్రాఫిక్స్‌లో ‘రామాయణ’ తగ్గేదేలే!

రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ సినిమా బాలీవుడ్‌లో కొత్త విజువల్ వండర్‌గా నిలవనుంది. హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ తరహాలో అత్యాధునిక VFX, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఈ చిత్రం కోసం ఉపయోగిస్తున్నారు. ఆస్కార్ గెలిచిన DNEG సంస్థ గ్రాఫిక్స్ బాధ్యతలు చూస్తోంది. దాదాపు ₹4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
News April 11, 2026
తిరుమల క్షేత్రపాలకుడు ఎవరో కాదు…!

7 కొండలపై కోట్లాది భక్తులకు అభయమిస్తున్న శ్రీవారి ఆలయానికి క్షేత్రపాలకుడు త్రిమూర్తుల్లో ఒకరైన శివుడి మరో రూపమైన రుద్రుడు. ఈ క్షేత్రపాలక శిల తిరుమల గోగర్భం వద్ద, పాపవినాశనం వెళ్లే మార్గంలో ఉంది. శివకేశవులకు భేదం లేదని ఇది నిరూపిస్తోంది. ప్రతి మహా శివరాత్రి రోజున TTD వారు ఇక్కడ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. తిరుమలలో విష్ణువుతో పాటు రుద్రుడికి కూడా ప్రాధాన్యత ఉందనడానికి ఇదే నిదర్శనం
News April 11, 2026
పెళ్లి చూపుల్లో కొత్త ట్రెండ్.. వేదిక, పద్ధతి మారుతోంది!

నేటి కాలంలో పెళ్లి సంబంధాల వేట మారుతోంది. ముఖ్యంగా నగరాల్లోని యువత పాత పద్ధతులకు స్వస్తి పలికి.. కొత్త తరం మ్యాచ్ మేకింగ్ పద్ధతులను ఎంచుకుంటున్నారు. వెబ్‌సైట్లలో ప్రొఫైల్స్ చూసుకొని వారిని స్వయంగా కలిసి మాట్లాడేందుకు ప్రత్యేక ఈవెంట్స్, మీటప్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. నమ్మకం, గోప్యతతో పాటు వ్యక్తిగత ఇష్టాలకు ప్రాధాన్యం ఇచ్చే ఈ వేదికలు ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయని తాజా నివేదికలు చెబుతున్నాయి.


