News December 27, 2024

ఆస్ట్రేలియా భారీ స్కోర్.. ఆలౌట్

image

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్సులో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ 140, లబుషేన్ 72, ఖవాజా 57, కొన్ట్సస్ 60, కమిన్స్ 49 పరుగులతో రాణించారు. బుమ్రా4 , జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక వికెట్ తీశారు.

Similar News

News November 24, 2025

సిద్దిపేట: అమ్మా.. నన్ను కొడుతున్నారు.. ఇవే చివరి మాటలు

image

సెలూన్‌కు వెళ్లిన యువకుడు తనను నలుగురు కొడుతున్నారంటూ తల్లికి ఫోన్ చేశాడు. తల్లి వెంటనే అక్కడికి వెళ్లి చూడగా విగత జీవిగా కనిపించిన విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. ములుగు మం. బస్వాపూర్ వాసి నర్సంపల్లి సందీప్(21) తుర్కపల్లి కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి సెలూన్‌కు వెళ్లి ఇంటికి రాలేదు. తల్లి రేణుక ఫోన్ చేయగా నలుగురు కొడుతున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేయగా వెళ్లి చూస్తే చనిపోయి ఉన్నాడు.

News November 24, 2025

32,438 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

RRB గ్రూప్-D పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. <>https://www.rrbcdg.gov.in/<<>>లో అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 32,438 పోస్టులకు ఈ నెల 27 నుంచి 2026 జనవరి 16 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇప్పటికే ఎగ్జామ్ సిటీ, డేట్ వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

News November 24, 2025

ఈ డిగ్రీ ఉంటే జాబ్ గ్యారంటీ!

image

కంప్యూటర్ సైన్స్ డిగ్రీ హోల్డర్లకే వచ్చే ఏడాది ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉన్నట్లు ఇండియా స్కిల్స్ రిపోర్టు-2026 వెల్లడించింది. వారిలో ఎంప్లాయిబిలిటీ రేటు 80%గా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో IT(78%), B.E/B.Tech(70%), MBA(72.76%), కామర్స్(62.81%), నాన్ IT సైన్స్(61%), ఆర్ట్స్(55.55%), ITI-ఒకేషనల్(45.95%), పాలిటెక్నిక్(32.92%) ఉన్నట్లు అంచనా వేసింది. డిగ్రీతోపాటు స్కిల్స్ ముఖ్యమని పేర్కొంది.