News March 17, 2024
స్వలింగ వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా మంత్రి

ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ స్వలింగ వివాహం చేసుకున్నారు. అదే దేశానికి చెందిన సోఫియా అల్లౌకేను పెళ్లాడారు. రెండు దశాబ్దాలుగా స్నేహితులుగా ఉన్న వాంగ్, అల్లౌకే అడిలైడ్‌లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోను వాంగ్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. కాగా ఆస్ట్రేలియాలో 2017 నుంచి స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశారు.
Similar News
News March 29, 2025
రోడ్లు వేయండి.. నిధుల కోసం వెనకాడొద్దు: సీఎం

TG: HRDCL రోడ్డు నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నగరంలో నిర్మించాల్సిన రహదారులు, వాటి విస్తరణలపై అధికారులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా రోడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. అవసరమైతే అదనపు స్థల సేకరణ జరపాలని, నిధులకోసం వెనకాడవద్దని స్పష్టం చేశారు.
News March 29, 2025
హిమాచల్‌తో విద్యుత్ ఒప్పందం గొప్ప ముందడుగు: భట్టి

TG: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హిమాచల్‌ప్రదేశ్‌తో 520MW ఒప్పందం చేసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇదొక గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. థర్మల్ పవర్ కంటే జల విద్యుత్ వ్యయం తక్కువగా ఉంటుందని తెలిపారు. హిమాచల్‌లో జీవ నదులు ఎక్కువగా ఉన్నందున 9-10నెలలు విద్యుత్ ఉత్పత్తికి వీలు ఉంటుందన్నారు. దీంతో తక్కువ ధరకే పవర్ దొరుకుతుందని పేర్కొన్నారు.
News March 29, 2025
ఈ రాశుల వారికి రేపటి నుంచి పండగే!

చాలా మంది రాశి ఫలాలను నమ్ముతుంటారు. ఉగాది వచ్చిందంటే చాలు ఆ ఏడాది తమ రాశి ఫలం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. రేపటి నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభంకానుంది. దీంతో కొత్త పంచాంగం అందుబాటులోకి రానుంది. అయితే ఈ నూతన ఏడాది మిథునం, కర్కాటకం, తుల, కన్య రాశుల వారి ఫలితాలు అద్భుతంగా ఉండనున్నట్లు పురోహితులు చెబుతున్నారు. వీరికి కొత్త ఏడాది శుభ ఫలితాలే. ఇంతకీ మీది ఏ రాశి? COMMENT