News June 21, 2024
T20WCలో ఆస్ట్రేలియా సూపర్ రికార్డు

T20 వరల్డ్ కప్ హిస్టరీలో వరుసగా అత్యధిక విజయాలు(8*) సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. 2022-24 మధ్య ఈ ఘనత సాధించింది. గతంలో ఇంగ్లండ్ వరుసగా 7(2010-12), ఇండియా 7(2012-14), ఆస్ట్రేలియా 6(2010), శ్రీలంక 6(2009), ఇండియా 6(2007-09) మ్యాచ్‌లు గెలిచాయి. అలాగే షార్ట్ ఫార్మాట్లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఆసీస్ వరుసగా 8 మ్యాచ్‌లలో విజయం సాధించింది.
Similar News
News October 23, 2025
కోత ముప్పు తప్పించేలా తీరం వెంబడి ‘గ్రేట్ గ్రీన్ వాల్’

AP: రాష్ట్రంలోని 1,053 KM తీరం వెంబడి 5 KM వెడల్పుతో ‘గ్రేట్ గ్రీన్ వాల్’ నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. మల్టీ లేయర్ గ్రీన్ బఫర్ జోన్లుగా ఇది ఉంటుంది. దీనివల్ల తుఫాన్ల నుంచి తీర రక్షణ, స్థిరమైన మత్స్య సంపద వృద్ధితో 30 లక్షల మంది ఉపాధి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. కేంద్ర పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల సహకారంతో అంతర్జాతీయ సంస్థల నుంచి, campa, nregsల ద్వారా నిధులు సమకూర్చనున్నారు.
News October 23, 2025
ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలు

ప్రతి ఏటా ఇన్స్టాగ్రామ్ అందించే ‘గ్లోబల్ గోల్డన్ రింగ్’ అవార్డును సొంతం చేసుకున్న తొలి భారతీయ వ్యక్తిగా డాలీసింగ్ రికార్డు సృష్టించింది. తమ కంటెంట్ ద్వారా స్థానిక సంస్కృతిని చాటే వారికి ఇన్స్టాగ్రామ్ ఈ అవార్డును అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 25మందిని ఎంపిక చేయగా అందులో డాలీసింగ్ స్థానం సంపాదించారు. 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమె డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌తోపాటు నటిగానూ పేరు పొందింది.
News October 23, 2025
391 కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

BSF స్పోర్ట్స్ కోటాలో 391 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఇంటర్ విద్యార్హతతోపాటు నేషనల్, ఇంటర్నేషన్ గేమ్స్‌లో రాణించిన వారు అర్హులు. వయసు 18-23ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ నవంబర్ 4. PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, స్పోర్ట్స్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్సైట్: https://rectt.bsf.gov.in/